పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్. తర్వాత వరుస విజయాలు అందుకుని టాలీవుడ్ పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలొచ్చాయి. అందులో ఒక సినిమా సూపర్ హిట్ అయింది. మరో సినిమా యావరేజ్ గా నిలిస్తే. అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.
పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ సినిమాల పరంగానే కాకుండా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ అనుబంధం ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉండగా పవన్ సినిమా విషయాలను త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. పవన్ ఎలాంటి సినిమా చేయాలి ? ఎన్ని రోజులు డేట్లు కేటాయించాలి ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి ? ఇలా అన్ని కూడా త్రివిక్రమ్‌మే పవన్ కు దగ్గరుండి చెప్తున్నాడు.
ఇక్కడ ఎవరికీ తెలియని మరో విషయం ఏమిటంటే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన పవన్ సినిమాలు ఏది బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ అవ్వలేకపోయాయి. ముందుగా పవన్ నటించిన
తీన్ మార్ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్. ఆ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇప్పుడు వచ్చిన బ్రో సినిమాలకు కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు. అయితే వాటిలో భీమ్లానాయక్ మాత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.
ఇప్పుడు వచ్చిన బ్రో సినిమా పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఎలా పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాల్లో ఒక అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా అంతగా సక్సెస్ అవలేదు.. అయినా సరే పవన్ ఇంకా త్రివిక్రమ్ వెనకాల తిరగటం ఇప్పుడు ఆయన అభిమానులకు నచ్చడం లేదు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే బ్యాడ్ సెంటిమెంట్ పవన్‌కు పెద్దగా వర్కవుట్ కాలేదనే అంటున్నారు.