ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమాకు నాలుగు టైటిల్స్‌.. సోష‌ల్ మీడియాలో పిచ్చ వైర‌ల్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా బ్రో మిక్స్ డ్ టాక్‌తో థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. సినిమా కంటెంట్ అనుకున్నంత లేద‌న్న చ‌ర్చ‌లు అయితే న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏపీలో అధికార వైసీపీ వాళ్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పృథ్విరాజ్‌తో శ్యాంబాబు అనే చిన్న రోల్ చేయించారు. ఓ పాట‌లో పృథ్వి వ‌చ్చి డ్యాన్స్ చేస్తాడు.

అయితే పృథ్వి చేసిన ఈ డ్యాన్స్ గ‌తంలో ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు ప‌బ్లిక్‌గా మ‌హిళ‌ల‌తో చేసిన డ్యాన్సుల‌ను పోలి ఉంద‌న్న కామెంట్లు వ‌చ్చాయి. దీనిపై అంబ‌టి రాంబాబు రెండు రోజులుగా ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ విరుచుకు ప‌డుతున్నారు. ప‌వ‌న్ బ్రో సినిమాతో పాటు ప‌వ‌న్‌ను టార్గెట్‌గా చేస్తున్నారు. బ్రో సినిమా వ‌ల్ల నిర్మాత‌ల జేబుల‌కు చిల్లు.. ప్యాకేజ్ జేబులు ఫుల్లు అని కామెంట్లు చేస్తున్నారు.

త‌న శ‌త్రువుల‌ను తిట్టాల‌నుకునే క్ర‌మంలోనే ప‌వ‌న్ ఈ సినిమాలు తీస్తున్నాడ‌ని కూడా మంత్రి విమ‌ర్శించారు. బ్రో సినిమాతో ప‌వ‌న్ త‌న‌ను తిట్టాల‌నుకున్నందువ‌ల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింద‌ని అంబ‌టి అన్నారు. ఇక ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త సినిమా కోసం కూడా క‌థ రెడీ అవుతోంద‌ని… ఈ సినిమాకు చాలా టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని.. నిత్య పెళ్లికొడుకు – తాళి ఎగ‌తాళి – బ‌హుభార్యా ప్ర‌వీణుడు – మూడు ముళ్లు ఆరు పెళ్లిళ్లు టైటిల్స్ పరిశీల‌న‌లో ఉన్నాయ‌ని ఎద్దేవా చేశారు. ఈ టైటిల్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.