ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా సరే.. యంగ్ బ్యూటీ శ్రీ లీలకే ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రధానంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండే సీనియర్ హీరో నుంచి నేటితరం యంగ్ హీరోల వరకు శ్రీలీలతోనే సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఈమె ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా 100 సినిమాల్లో నటించిన క్రేజ్‌ను అందుకుంది. ఇప్పటికే 10 సినిమాలు నటిస్తున్న శ్రీలీలా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు.
మనందరికీ తెలిసిందే ఈ రీసెంట్ టైమ్స్ లో శ్రీ లీలకు సంబంధించిన ఎలాంటి వార్తలు వైరల్ గా మారాయో.. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరి ఆ వార్త ఏమిటంటే శ్రీ లీలకు సాధారణంగా కోపమే రాదట.. ఎవరైనా సరే ఈమె పై నిందలు వేసిన, లేనిపోని మాటలు చెప్పిన.. ఈమెను కొట్టినా సరే అసలు ఫీల్ అవ్వదట.
ఇంత ఓర్పు సహనం ఉన్న శ్రీలీలకు కూడా ఓ మాట అంటే చచ్చేంత కోపం వస్తుందట.
అంతేకాకుండా ఆ మాట అన్న వారిని చంపిన చంపేసేస్తుందట అంత కోపం వస్తుందట. ఆ మాట అంటే.. ఇంతకు ఆ మాట ఏంటి అనుకుంటున్నారా..? పొట్టి పిల్ల.. ఈమె కొంచెం హైట్ తక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరైనా సరే తనను పొట్టి అన్నా, పొట్టి పిల్ల అన్నా, పొట్టి దాన అన్నా ఈమెకు చచ్చేంత కోపం వస్తుందట. అంతేకాకుండా అలా అన్నవారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వటమే కాకుండా కుదిరితే నాలుగు దెబ్బలు కూడా వేస్తుందట. దీంతో శ్రీలీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు సిల్లిగా కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.