తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 18 సంవత్సరాలకు పైగా ఒకే స్టార్ డమ్తో కొనసాగుతూ ఇప్పటికీ యువతను అలరిస్తున్న బ్యూటీ తమన్నా. తన అందంతో, నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మటాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగానే వెబ్ సిరీస్లో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటిస్తుంది. ప్రస్తుతం జైలర్ సినిమాలో నటించడమే కాకుండా చిరంజీవికి జంటగా భోళాశంకర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే జైలర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా ఆ పాటలో వేసిన హుక్ స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. .
ఇకపోతే తమన్నా- రమ్యకృష్ణ తర్వాత అలాంటి అరుదైన ఘనతను సాధించింది అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. గతంలో రమ్యకృష్ణ, నాజర్ పక్కన చెల్లిగా, భార్యగా పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే ఘనత దక్కించుకుంది. ఒక హీరో సరసన ఒకప్పుడు లవర్ గా నటించే ఇప్పుడు చెల్లిగా నటిస్తుంది.
ఆ హీరో మరెవరో కాదు అక్కినేని హీరో సుశాంత్.. ఆయన తోలి సినిమా కాళిదాస్ లో తమన్నా- సుశాంత్ కి జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో సుశాంత్ కి చెల్లిగా కనిపించబోతుంది. ఇక భోళా శంకర్ సినిమా ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.