చిత్రం హీరోయిన్ ‘ రీమాసేన్ ‘ ఇంత ల‌గ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తోందా…!

రీమాసేన్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కోలకతాలో జన్మించిన ఈమె చదువు పూర్తైన త‌ర్వాత ముంబైలో మోడల్ గా కెరీర్‌ ప్రారంభించింది. అలాగే అనేక యాడ్స్ లో కూడా నటించింది. 2000వ సంవత్సరంలో ‘ చిత్రం ‘ సినిమా తో సినీ రంగానికి పరిచయం అయ్యింది. తేజ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు.

అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రీమాసేన్ కి ఆఫర్స్ క్యూ కట్టాయి. చిత్రం సినిమా త‌ర్వాత మనసంతా నువ్వే, బావ నచ్చాడు, సీమ సింహాం, యమగోల, నీతో వస్తా వంటి అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో దూసుకుపోతున్న సమయంలో కోలీవుడ్ కు మకాం మార్చింది.

అక్కడ కూడా అనేక సినిమాల్లో నటించింది మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. కన్నడ, హిందీ, మరాఠి భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. కెరీర్ ఊపందుకుంటుంది అనే సమయంలో రీమాసేన్ ఓ ఇంటికి కోడలు అయింది. ప్రముఖ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను 2012 లో పెళ్లాడింది. పెళ్లి తర్వాత నటనకు పులిస్టాప్ పెట్టి ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేసింది.

ఈమె భర్త శివ్ కరణ్ ఇండియాలోనే టాప్ రెస్టారెంట్ గ్రూప్స్ కి అధినేత. శివ కరణ్ కు ప్రతి రాష్ట్రంలోనూ ఒక రెస్టారెంట్ ఉంది. అందువల్ల పెళ్లి తర్వాత రీమాసేన్ తన నటనకు పులిస్టాప్ పెట్టి… భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సెటిల్ అయిందట. అలాగే ఈ దంపతులకు 2013లో ఒక కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీతో ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి దూరమైన తన గ్లామర్ ని మాత్రం ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తుంది. కొంచెం బరువు పెరిగినా… ఆమె అందం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు.