ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు సుమన్. మెగాస్టార్ లాంటి టాప్ హీరోలకు పోటాపోటీగా నటించి హిట్లర్ తనకాలో వేసుకున్న సుమన్ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఒక వివాదంలో చిక్కుకోవడంతో అతని కెరీర్ నాశనం అయిందనే చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు అంటే దానికి కారణం కేవలం ఓ కేసులో చిక్కుకోవడమే దాని కారణం. ఆ ఘటనకు ముందు దర్శక, నిర్మాతలు సుమన్ కాల్ షీట్ల కోసం ఎదురు చూసేవారు.
అలాంటిది నీ… లి చిత్రాల కేసులో సుమన్ ఇరుక్కోవడం, అరెస్ట్ కావడంతో సుమన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇలా కావాలనే సుమన్‌ను కొంతమంది ఇరికించారంటూ అందులో చిరంజీవి మొదట వ్యక్తి అంటూ కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ సుమన్ దీనిపై చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదు అంటూ వివరించాడు. గతంలో దివంగత డైరెక్టర్ సాగర్ సుమన్ సంఘటన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. దీంతో ఈ వివాదంలో చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది.
తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర డిజిపి ఒకరు ఉండే వారిని అలాగే లిక్కర్ కాంట్రాక్టర్ కూడా ఒకరు ఎంజీఆర్ కు బాగా సాహిత్యంగా ఉండేవారు వీరు ముగ్గురు వల్ల సుమన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందట. ఆ డీజిపి కుమార్తె సుమన్‌ని ప్రేమించింది.. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. సుమన్ ఎక్కడ ఉంటే ఆమె అక్కడికి వెళ్లడం అతనిపై ఇష్టం పెంచుకోవడం చేసింది. సుమన్ కి మాత్రం ఆమెతో ఎటువంటి సంబంధం లేదు. ఆమె వైపు నుంచి వన్ సైడ్ లవ్ ఉండేది. డీజిపికి అది తప్పుగా అర్థమైంది.
తన కుమార్తెను సుమన్ ట్రాప్ చేశాడు అనుకున్న డీజిపి ఎంజీఆర్ కు ఆ విషయాన్ని వివరించాడు. ఎంజీఆర్ సుమన్ ని పిలిపించి డీజిపి కుమార్తెకు దూరంగా ఉండమని హెచ్చరించాడు. కానీ సుమన్ మాత్రం నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు.. ఈ విషయం నాకు కాదు ఆమెకు చెప్పండి అంటూ వెళ్లిపోయాడు. దీంతో ఎంజీఆర్ కి కోపం వచ్చి సుమన్‌ను తప్పుడు కేసులో ఇరికించాడంటారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్లు షాపు ఉండేది.. అక్కడికి అమ్మాయిలు కూడా వచ్చేవారు. దీంతో సుమన్ కి బెయిల్ రాకుండా పలు కేసుల్లో ఇరికించి జైలు శిక్ష పడడానికి కారణమయ్యాడంటూ సాగర్ చెప్పాడు.