సాయి పల్లవి – శ్రీ లీల ఆ మ్యాట‌ర్‌లో సేమ్ టు సేమ్‌… మీరు గ‌మ‌నించారా…!

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన శ్రీలీల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో చేసింది రెండు సినిమాలే కానీ, ఆ రెండు సినిమాలతోనే ఈమె టాలీవుడ్ లోని మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. యంగ్ హీరోలే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఈమె తమ సినిమాల్లో హీరోయిన్‌గా కావాలంటూ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10కి పైనే సినిమాలు ఉన్నాయి.

తీరిక‌నేదే లేకుండా శ్రీలీల‌ బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఎంతో బిజీగా కొనసాగుతుంది. అయితే ఈ యంగ్ స్టార్ హీరోయిన్‌కు నాచురల్ బ్యూటీ సాయి పల్లకి మధ్య ఓ కామన్ పాయింట్ ఉందట. ఇంతకీ ఆ కామన్ పాయింట్ మరేదో కాదు డాన్స్.. శ్రీ లీల- సాయి పల్లవి ఇద్దరు గొప్ప డాన్సర్లు. అదే ఈ ఇద్దరిని స్టార్ హీరోయిన్లుగా మార్చింది. ఇండస్ట్రీని ఏలాలంటే కచ్చితంగా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉండాల్సిందె.. శ్రీలీల, సాయి పల్లవి కూడా స్పెషల్ టాలెంట్ డాన్స్.. వీరిద్దరూ కాలు కదిపారంటే ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే.

ఆ డాన్స్ కారణంగానే ఇద్దరు అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. అలాగే భారీ స్టార్‌డం కూడా తెచ్చుకున్నారు. ఇదే సమయంలో వీరిద్దరి గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఇటు సాయి పల్లవి అటు శ్రీ లీల ఇద్దరు డాక్టర్ చదివి యాక్టర్ అయ్యారు. కాగా, ప్ర‌స్తుతం శ్రీ‌లీల గుంటూరు కారం, భ‌గ‌వంత్ కేస‌రి, స్కంద‌, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, ఆది కేశ‌వ వంటి చిత్రాల్లో న‌టిస్తోంది.

ఇక సాయి ప‌ల్ల‌వి విష‌యానికి వ‌స్తే.. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం నుంచి సినిమాలు చేయ‌డం త‌గ్గించింది. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేయ‌డం లేదు. వెకేష‌న్లు, విహార‌యాత్రలు అంటూ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తెలుగులో సాయి ప‌ల్ల‌వి ఒక్క సినిమాకు కూడా ఒప్పుకోలేదు. కోలీవుడ్ లో మాత్రం శివ‌కార్తికేయ‌న్ కు జంట‌గా క‌మ‌ల్ హాస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీకి క‌మిట్ అయింది. ఇలా ఇద్ద‌రు