ప్ర‌భాస్‌కు ఉన్న అతి పెద్ద వీక్‌నెస్ తెలిస్తే పిచ్చ కామెడీయే…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కమర్షియల్ స్టార్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి ఓ వీక్నెస్ ఉంటుందట. సినిమా మొత్తం ప్రభాస్‌కి ఉన్న ఈ వీక్నెస్ మీదే రన్ అవుతుందట.

ఈ క్రమంలో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని సమాచారం. మారుతి అంటేనే చిన్న పాయింట్ నుంచి ఫుల్ కామెడీ తీసుకువచ్చే డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ప్రభాస్ తో రూపొందించే ఈ సినిమాల్లో ఏ రేంజ్ లో కామెడీని పండిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ చిత్రానికి రాయల్ లేదా అంబాసిడర్ అనే టైటిల్ లను చూస్తున్నారట. నిజానికి ఇప్పటివరకు రాజా డీలక్స్ అనే పేరు వినిపించినా.. ప్రస్తుతం మాత్రం ఈ రెండు పేర్లలో ఒక దానిని టైటిల్ గా ఫిక్స్ చేయాలని మూవీ టీమ్‌ చూస్తున్నట్లు సమాచారం. రాయల్ టైటిల్ పైనే మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. మొత్తం మీద మారుతి ఈ సినిమా కోసం అద్భుతమైన కంటెంట్‌ రెడీ చేశాడని ప్రభాస్ కి పూర్తిగా ఇది ఓ డిఫరెంట్ జోనర్ అవ్వబోతుందంటూ తెలుస్తుంది.

కాగా ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా హిట్ అయితే మారుతీ క్రేజ్ ఓ రేంజ్ లో పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కూడా సలార్, కల్కి 2898 AD సినిమాలతో ప్రేక్షకుల‌ ముందు రాబోతున్నాడు. మరి ఈ సినిమాలతో ప్రభాస్ క్రేజ్‌ మరో లెవల్ కి వెళ్లడం ఖాయం అంటూ కూడా అంటున్నారు.