ఇదే న్యూస్ ఇప్ఉడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న సమంత తన ట్రీట్మెంట్ కోసం ఓ స్టార్ హీరో దగ్గర అప్పు చేసిందా…? అంటే అది నిజమే అంటున్నారు సినీ ప్రముఖులు, సినీ విశ్లేషకులు. ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్, బాలీవుడ్, ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.
సినీ ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలును సంపాదించుకున్న సమంత ప్రజెంట్ మయూసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. రీసెంట్ గానే సినిమాలకు ఒక ఏడాది పాటు బ్రేక్ చెప్పి ఆమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళింది. సమంతా కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.
హీరోయిన్ సమంతకు తన ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా ట్రీట్మెంట్ కోసం ఓ స్టార్ హీరో దగ్గర రూ.25 కోట్లు అప్పుగా తీసుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు అవుతుందని… ఈ క్రమంలోనే ఆమె దగ్గర డబ్బులు లేక తాన స్నేహితుడు దగ్గర అప్పు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న సమంత ఇలా మరో హీరో దగ్గర అప్పు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
అంతేకాదు అక్కినేని ఫ్యామిలీలో ఉండుంటే ఇలా మరో హీరో దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అంటూ అక్కినేని అభిమానులు సమంతను ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో సమంత నోరు విప్పితేనే తెలుస్తుంది అంటున్నారు సమంత ఫ్యాన్స్..!