ప్రభాస్, మారుతి సినిమా చేస్తారా… చెయ్యరా… నిర్మాత కు భారీ నష్టమే….!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వ‌స్తున్న‌ సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు సలార్, కల్కి 2898 AD సినిమాల‌ మీదే ఆశలు పెట్టుకున్నారు. సలార్ మూవీ రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకి రానున్నది.

ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ప్రభాస్ తన తదుపరి సినిమాను ఇప్ప‌టికే మారుతి దర్శకత్వంలో మొదలుపెట్టాడు..కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టేసారని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత ఇప్పటికే ప్రభాస్, మారుతి సినిమాపై పెద్ద మొత్తంలో ఖర్చు చేశారట.

ఇలాంటి సమయంలో ఆ సినిమాని పక్కన పెట్టడం వల్ల నిర్మాతకి భారీ నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అసలు సినిమా చేస్తారా ? చెయ్యరా ? అనేది కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మరి రాబోయే రోజులైన ప్రభాస్, మారుతి సినిమాపై ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.