తెలుగు చదవడం, రాయడం రాని టాలీవుడ్‌ స్టార్ హీరో, హీరోయిన్లు వీళ్లే…!

తెలుగు సినీ పరిశ్రమ ఎంతో కీర్తిని సాధిస్తుంది. నేషనల్ వైడ్‌గానే కాక‌ ఇంటర్నేషనల్ వైడ్‌గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న తెలుగు సినిమాల గురించి దేశ‌వ్యాప్తంగా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంటే తెలుగు సినిమాలు ఏ రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలా టాలీవుడ్‌కి ప్రతి ఏడాది ఇతర భాషల నుంచి ప్రముఖ నటినట్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. వారికి తెలుగు రాకపోయినా పెద్ద సమస్యగా ఉండదు.

కానీ ఇక్కడే పుట్టి, పెరిగి తెలుగు సినిమాల ద్వారా స్టార్ డ‌మ్‌ సంపాదించుకున్న చాలామంది స్టార్ హీరోల‌కి తెలుగు రాదు వారెవరో ఒకసారి చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణకి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. స్టార్ హీరోగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మహేష్ బాబుకు తెలుగు రాయడం కానీ చదవడం కానీ రాదట. ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విష‌యం బయటపెట్టాడు.

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి నాగార్జున అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్‌ మన్మధుడిగా పేరు సంపాదించుకున్న నాగార్జునకు కూడా తెలుగు రాయడం, చదవడం రాద‌ట. షూటింగ్స్ లో కూడా ఇంగ్లీష్‌లో డైలాగ్లు రాసుకుని ప్రాక్టీస్ అవుతాడట. నాగార్జున కొడుకులు చైతన్య, అఖిల్ పరిస్థితి కూడా ఇదే.

డైలాగ్ కింగ్‌ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి న‌టిగా, ప్రొడ్యూసర్‌గా, హోస్ట్ గా మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మికి తెలుగు అక్షరం ముక్క కూడా రాయడం రాదట. తెలుగు చదవాలన్నా, రాయాలన్న ఆమెకి చాలా క‌ష్టంగా ఉంటుంది. ఆమె అన్న మంచు విష్ణు కి కూడా తెలుగు రాయడం చదవడం రాదు. ఇలా వీరే కాకుండా ఎంతో మంది హీరోలు, హీరోయిన్‌లు కూడా ఇప్ప‌టికి తెలుగు చ‌ద‌వ‌టం రాయ‌డం రాని వారు ఉన్నారు.