చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు అదృష్టం కలిసి రాకపోతే మంచి సినిమాలను కూడా వదులుకుంటారు.. అలాంటి బ్యాడ్ లక్ కొన్నేళ్లపాటు తన పక్కనే పెట్టుకుని వచ్చాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. బాహుబలి సినిమాలకు ముందు ప్రభాస్ ఎలాంటి డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెటినప్పటి నుంచి ప్రభాస్ తన సినిమాల కథల విషయంలో ఆయనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారట.
అందుకే కొన్ని కొన్ని సార్లు ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలియక తన బాడీకి మ్యాచ్ అయ్యే కథలను ఎంచుకొని ప్లాప్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ప్రభాస్ తన కెరీర్లో ఇప్పటివరకు 8 బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడట. ఆ సినిమాలు ఏమిటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా లెక్కల మాస్టర్ సుకుమార్ తొలి సినిమా ఆర్య. ఈ సినిమాను ముందుగా ప్రభాస్తో చేయాలని అనుకున్నాడు. కానీ ఈ పాన్ ఇండియా హీరో కొత్త డైరెక్టర్ కావడంతో ఈ సినిమాను వదులుకున్నాడు.
ఆ తర్వాత సుకుమార్ అదే కథతో అల్లు అర్జున్తో ఆర్య సినిమా తీసి బన్నీకి భారీ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బృందావనం సినిమా సైతం వంశీ పైడిపల్లి ముందుగా ప్రభాస్తో చేయాలని భావించాడట. అయితే అప్పటికే వంశీ పైడిపల్లి ప్రభాస్ కు మున్నాలాంటి భారీ డిజాస్టర్ ఇవ్వటంతో బృందావనం కథను రిజెక్ట్ చేశాడు.
అదేవిధంగా మహేష్ నటించిన ఒక్కడు, నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి, అలాగే సురేందర్ రెడ్డి, రవితేజ కాంబోలో వచ్చిన కిక్. ఇక రామ్ చరణ్ వివి వినాయక్ కాంబోలో వచ్చిన నాయక్. ఇక గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వచ్చిన డాన్ శీను ఇలా ఇన్ని భారీ హీట్ సినిమాలను సైతం చిన్న రీజన్ తో ప్రభాస్ వదులుకున్నాడు.