విశ్వ‌క్ ఊర‌మాస్‌.. నేహా అందాలు .. ప‌వ‌ర్ ఫుల్‌గా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” గ్లింప్స్ ( వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల దాస్ కా ధమ్కి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తన రాబోయే య‌క్షన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్‌తో తెర‌క‌క్కుతున్న ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేస్తూ నిర్మాతలు ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి కీలకపాత్రలో కనిపిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. గతంలో ఎప్పుడు చూడని పాత్రలో చూపించారు మేకర్స్ పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ అటు నేహా శెట్టి అందాలు అదిరిపోయాయి. ఈ సినిమాలో నాజర్. సాయికుమార్, గోపరాజు, రమణ కీలక పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ రేంజ్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి.

ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ భ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై మామూల హైప్ రాలేదని చెప్పాలి.