దివంగత స్టార్ హీరో ఉదయ్‌కిరణ్ భార్య రెండో పెళ్లి చేసుకుందా.. ఆమె చేసిన ప‌నికి హ్యాట్సాఫ్‌…!

చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఎంత అద్భుతంగా నటించినా కొందరికి అవకాశాలు రావు.. కొంతమందికి ఇండస్ట్రీలోకి వచ్చిన ఓవర్ నైట్ లోనే స్టార్డం తెచ్చుకుంటారు. తర్వాత వారు తప్పులు చేస్తారో లేదంటే స్టార్డం వచ్చిన అహంతో ఉంటారో తెలియదు కానీ అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమకు దూరమైపోతూ భారీ నష్టాల్లో కూరుకుపోతారు.

ఇదేవిధంగా టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ అతి తక్కువ కాలంలోనే కనుమరుగైపోయాడు.. అదేవిధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. అలాంటి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని తన భార్యకు తోడు లేకుండా ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు. ఇక మరి ఇప్పుడు ఉదయ్ కిరణ్ భార్య విషిత ఏం చేస్తుంది..? ఎక్కడ ఉంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో ప్రేమ కథ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత సినిమాల విషయంలో పొరపాట్లు చేయడం కారణంగా వరు’ ప్లాప్‌లు వచ్చాయి. దీంతో ఇబ్బందులు భరించలేక రూమ్ లోనే ఉరే*కున్నాడు. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఇలా చేసుకోవడంతో ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణం ఓ మిస్టరీగానే ఉండిపోయింది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత అతని భార్య విషిత కొన్ని రోజులు డిప్రెషన్ లో ఉండిపోయిందట.

ఆ తర్వాత కొంచెం కొంచెం ఆ బాధ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం సాప్ట్ వేర్ జాబ్ చేస్తుంది. ఉదయ్ కిరణ్ మ‌ర‌ణం తర్వాత ఆమె భార్య ఎన్నో ఇబ్బందులు కూడా ప‌డింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ.. దాని ద్వారా వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు ఇస్తూ గడుపుతోంది. ఉదయ్ కిరణ్ ని మరిచిపోలేక పెళ్లి కూడా చేసుకోవడం లేదట విషిత. ఉదయ్ కిరణ్ కనుక ఉండి ఉంటే.. వారి లైఫ్ మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.