ఎన్టీఆర్ కోప్ప‌డ్డా… ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ ప‌ని చేయ‌న‌న్న ఏఎన్నార్‌… !

టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉంచడానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎంతగానో కృషి చేశారన్న విష‌యం అంద‌రికి తెలుసు. అప్పట్లో వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉండే వాళ్ళు. వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ వల్ల అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు తెర‌కెక్కాయి. ఇక ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు వస్తే అభిమానులు ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. కానీ అప్పట్లో మాత్రం ప్రేక్షకులు వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీ స్టార‌ర్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఇక ఏఎన్నార్ చివరి వరకు సినిమాల్లో కొనసాగగా.. ఎన్టీఆర్ సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

కానీ ఎన్టీఆర్ తన జీవితంలో ఓ విష‌యంపై ఏఎన్నార్‌ని నాలుగైదు సార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడని కానీ ఏఎన్నార్‌ మాత్రం దానికి ఒప్పుకోలేద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని భావించినప్పుడు తనతో పాటు ఏఎన్నార్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావ‌లుకున్నార‌లట‌. ఇదే విషయాన్ని ఎన్టీఆర్, ఏఎన్నార్‌ తో ప్రస్తావిస్తే రెండు సార్లు చూద్దాం బ్రదర్ అంటు తప్పించుకున్నాడట. మూడోసారి ఈ విష‌యంపై ఎన్టీఆర్ ఏఎన్నార్ పై కోప్ప‌డ్డా.. ఎంత రిక్వెస్ట్ చేసిన తాను సినిమాలు చేయాలనుకుంటున్నాను రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు.. నా ఆరోగ్యం కూడా బాగోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడట‌.

అంతే కాకుండా నా ద‌గ్గ‌ర ఉన్నా డబ్బు అంతా అన్నపూర్ణ స్టూడియోస్ పై పెట్టేసాను. అలాగే రాజకీయాల్లోకి రావాలంటే ఆరోగ్యం, డబ్బు కూడా చాలా ముఖ్యం. ఈ రెండు లేనప్పుడు రాజకీయాల్లోకి రావడం చాలా కష్టం. అందుకే నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు ఇంకోసారి ఈ విషయంపై నన్ను అడగవద్దు అంటూ మొహం మీద చెప్పేశాడట. దీంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించడం మానేశాడట.