చిత్ర పరిశ్రమలో సినిమాలో నటించే నటీనటుల యాక్టింగ్ చూడడానికి ఈజీగానేే ఉంటుంది. కానీ చేస్తేనే అది ఎంత కష్టమో తెలుస్తుంది. ఇక అదే విధంగా చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలంటే ఎంతో కష్టపడాలి, అదేవిధంగా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక ఇప్పుడు పై ఫోటోలో కనిపిస్తున్న పాప కూడా అలానే టాలీవుడ్ లో హీరోయిన్గా అడుగు పెట్టింది. కెరీర్ మొదటిలో చిన్న సినిమాలు చేసింది కానీ స్టార్ హీరోలతో చేసిన ఒకటి రెండు మూడు సినిమాలు హిట్ కావడంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇక మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? హీరోయిన్ ఎవరంటే.. చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు మహా అంటే ఓ 10 సంవత్సరాల పాటు వరుసగా అవకాశాలు అందుకుంటారు. ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాలు వస్తాయి అంటే కష్టమే కానీ ఈ హీరోయిన్ మాత్రం ఎప్పుడో 2008లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌లు అడుగు పెట్టి 18 సంత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆమె చేతిలో సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూనే ఉంది. ఇక మీకు ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది. ఇక పై ఫోటోలో ఉన్న పాప మరి ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇక త్వరలోనే ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్‌తో నటించిన జైలర్, చిరంజీవితో చేసిన భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
ఇక గత సంవత్సరం తమన్నా కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు కానీ సంవత్సరం మారేసరికి అంతా మారిపోయింది. వరుస సినిమాలు వెబ్ సిరీస్‌లలో అవకాశాలు అందుకుని బిజీ హీరోయిన్గా మారిపోయింది మిల్కీ బ్యూటీ. ఇప్పటికే తమన్న జీకర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయం అందుకుంది. అదేవిధంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తాను నటించే సినిమాలలో ముద్దు సన్నివేశాలకు నో చెబుతూ వచ్చిన తమన్నా ఓటీటీ అనేసరికి తన రూల్స్ కు బ్రేక్ ఇచ్చు మరి విచ్చలవిడిగా నటించింది.
ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో ప్రేమ వ్యవహారంతోనూ తమన్నా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ నిలుస్తుంది. ఈ విధంగా తమన్నా కెరీర్ అయిపోయింది అనుకున్నారు కానీ ఇప్పుడు ఆమె మరోసారి ట్రెండింగ్ లో కి వచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడూ ఆమె చిన్నప్పటి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.