దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్… ఎన్టీఆర్‌కు జోడీగా ఆ ముద్దుగుమ్మ‌..!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తరువాత తెర‌కెక్కుతోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుంద‌ట‌.

ఎప్పటినుంచో ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ , రష్మిక మందన్న పేర్లు వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు మృణాల్ ఠాకూర్ ను మరో హీరోయిన్గా ఫిక్స్ చేశారని సమాచారం అందుతుంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంద‌ట‌. దీంతో సోషల్ మీడియాలో ఎన్‌టీఆర్ – మృణాల్ జంట చూడ చక్కగా ఉంటుందని మృణాల్ హ్యాష్ ట్యాగ్ దేవ‌ర‌ అంటూ మృణాల్ పేరును వైరల్ చేస్తున్నారు అభిమానులు.

ఇక సినిమాలో వీరిద్దరి కాంబో ఎలా? ఉంటుందో చూడాలి.. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. కొరటాల శివ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఈ సినిమా మరో 250 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.