టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ల‌నే క‌న్నీళ్లు పెట్టించిన సినిమాలు ఇవే…!

కొన్ని ఎమోషనల్ సినిమాలు చూసినప్పుడు అభిమానులు కంటనీరు పెట్టుకోవడం సహజమే. కానీ సినిమా నటులు కూడా కొన్ని సినిమాను చూసి కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ అలా సినిమాను చూసి కన్నీరు పెట్టుకున్న మ‌న టాలీవుడ్ నటులు ఎవరు? ఆ సినిమాలు ఏంటో? ఒకసారి చూద్దాం.

చిరంజీవి :
‘ శంకరాభరణం ‘ సినిమా రిలీజ్ అయిన కొత్తలో రివ్యూ ఇవ్వడానికి నన్ను పిలిచారు ఆ సినిమా పూర్తయి లైట్లు వేసే సమయానికి నేను కన్నీరు తుడుచుకుంటున్నాను అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు ఆ సినిమాలో మంజు భార్గవి తన పాత్రలో జీవించేసింది సినిమాను చూసినంత సేపు నిజ జీవితంలో ఫీల్ అయిపోయాను నాకు తెలియకుండానే కన్నీరు వచ్చేసాయి బయటకు వచ్చిన తర్వాత ఎవరేమనుకున్నారో అని అనిపించింది అని చిరంజీవి ఓ సందర్భంలో వివరించారు.

మహేష్ బాబు :
‘ ద లయన్ కింగ్ ‘ ఇది చిన్న పిల్లల సినిమా కదా అనుకుంటారు చాలామంది కానీ ఇందులో కుటుంబ బంధాలు మమకారాలు చక్కగా చూపించారు ఈ సినిమా చూసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యలు, పిల్లలు పడే ఇబ్బందులు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు తండ్రిగా నేను ఆ సినిమాను ఫీల్ అవ్వడం వల్ల ఏమో నాకు చాలా బాధ కలిగింది అంటూ మహేష్ బాబు వివరించాడు

సమంత :
ఆడపిల్లలు వ్య..చార కూపంలో పడి జీవచ్ఛ‌వ‌ల్లా ఎలా బతుకుతున్నారు. ఈ అంశంపై ఓ యదార్థ సంఘటన ఆధారంగా ‘ నా బంగారు తల్లి ‘ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితిలో ఉన్న వారి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో సినిమా చూసిన తర్వాత అర్థమైంది. చాలా రోజులు ఆ సినిమా సన్నివేశాలు గుర్తొచ్చి నిద్ర పట్టలేదు. నా ప్రమేయం లేకుండానే ఆ సినిమా చూసే సమయంలో కంట నీరు వచ్చింది అంటూ సమంత ఓ సందర్భంలో తెలియజేసింది.

కృతి శెట్టి :
బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి గా నటించిన కృతి శెట్టి ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. వ్యక్తిగత జీవితానికి మా సాంప్రదాయాలకు ఈ సినిమాకి ఎంతో దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ సినిమాను చూసినప్పుడు నేను ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను అంటూ వివరించింది. మా శెట్టి కుటుంబాల్లో కూడా చనిపోయిన పెద్దవాళ్ళు ఆత్మగా మారి కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ వారిని కాపాడుకుంటారని నమ్ముతాము. వాళ్లకి ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతాయి బంగారు రాజు సినిమాల్లో అలాంటి దృశ్యాన్ని నేను చూసినప్పుడు మా కుటుంబంలో చనిపోయిన పెద్దవారు గుర్తు వచ్చి భావోద్వేగానికి గురి అయ్యాను కన్నీళ్లు వచ్చాయి అంటూ వివరించింది కృతి.

కియారా అద్వానీ :
పాతికేళ్ల వయసులో కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన విక్రమ్ బాత్ర జీవిత కథను ఆధారంగా ‘ షేర్షా ‘ సినిమాను రూపొందించారు. ఇందులో ఎమోషనల్ సన్నివేశాలు ఎంతో మంది ప్రేక్షకులకు కన్నీరు తెప్పించాయి. నిజ జీవితంలో వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయానికి విక్రమ్ వీరమరణం పొందడంతో డింపుల్ ఆయన జ్ఞాపకాలతో అలానే ఉండిపోయారు. ఆ సినిమాలో హీరోయిన్ గా నేను డింపుల్ పాత్రను పోషించాను ఆ సినిమాలో విక్రమ్ చనిపోయిన దృశ్యాలు అంత్యక్రియలు చూస్తే నాకు ఏడుపొచ్చింద‌ని తెలిపింది.