బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించింది జ్యోతి రాయ్. ఈ సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జ్యోతి తెలుగుతో పాటు కన్నడ ఇండస్ట్రీలోనూ పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది. గుప్పెడంత మనసు సీరియల్ లో ట్రెడిషనల్ గా కనిపించిన జగతి సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా తన హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది.
ఈమెకు ముందుగా పద్మనాభతో వివాహం జరిగింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక తాజాగా ఆమె ఇన్‌స్టాలో డైరెక్టర్ సుకు పూర్వజ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకోవడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జ్యోతి తన ఇన్‌స్టాలో ఓ స్టోరీని షేర్ చేసింది. ఆమె కొత్తగా ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేసి ఆ ట్విట్టర్ కు ప్రియుడు పేరును ఆమె పేరుతో కలుపుకొని జ్యోతి పూర్వజ్ అని పేరు పెట్టుకుంది.
ఆ పేరు చూసి జనం షాక్ అవుతున్నారు. అసలైతే పెళైన అమ్మాయిలు పేరు లాస్ట్ లో భర్త పేరును జోడిస్తూ ఉంటారు. ఈ ఫోటోను చూస్తే జ్యోతి కి సుక్కు పూర్వజ్‌కు పెళ్లయినట్లు అనిపిస్తుంది. ఇక నిజంగానే జ్యోతి రాయ్ – పూర్వజను పెళ్లి చేసుకుందా లేదా అతడి పై ఉన్న ప్రేమతో పేరు చివర అతడి పేరు జోడించిందా ? అనే విషయం తెలియాలి. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుడంతో నెటిజెన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు.