ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్గా అగ్రస్థానంలో దూసుకు వెళ్తుంది యంగ్ బ్యూటీ శ్రీ లీల. స్టార్ హీరోస్ దగ్గర నుంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరు ఆమెను హీరోయిన్గా పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ లీల చేతిలో ప్రస్తుతం 12 సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ గడుపుతున్న శ్రీ లీలా ఇప్పటికీ ఎవరైనా డైరెక్టర్ ఆమె దగ్గరకు వెళితే నో అని చెప్పకుండా కాల్ షీట్స్ ఎలాగోలా అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తుందట.
ఇలా శ్రీ లీల బిజీ స్టార్ గా పేరు సంపాదించుకున్న నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి శ్రీలీల జోష్యం చెప్పారు. శ్రీ లీల సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం ఆమె జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఉండడమేనట. ఆమెది మీనరాశి కావడంతో ప్రస్తుతం ఆమెకు రాజయోగం నడుస్తుందని ఈ రాజయోగానికి పెద్ద పేరు తెచ్చే శక్తి ఉందని చెప్నాడు. పేరు పెరిగిన కొద్దీ డబ్బు దానంతట అదే పెరుగుతుంది.
ఇలా 2028 వరకు శ్రీ లీల టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదగబోతుందట. మంచి నటిగా, లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటుందట. నయనతార, సమంత, రష్మిక మందన, పూజ హెగ్డేలాంటి హీరోయిన్స్‌లా స్టార్డంను సొంతం చేసుకోబోతుందని శ్రీ లీల జాతకం చెప్పాడు వేణు స్వామి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.