బాలయ్య – బాబి మూవీలో ఆ స్టార్ హీరో కూడా… బాబి సూప‌ర్ ట్విస్ట్‌…!

నందమూరి న‌ట‌సింహ బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె 109 టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం బాలయ్య భగవంత్‌ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బాబి డైరెక్షన్లో ఎన్.బి.కె 109 సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొన్ని అదిరిపోయే అప్డేట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ స్టోరీ అని వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ కన్నా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని బాబీ స్టోరీని అలాగే రూపొందిస్తున్నాడని.. బాలయ్య క్యారెక్టర్ ఇందులో చాలా కొత్తగా కనిపించబోతుందని తెలుస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ నేప‌థ్యంలో ఉన్న క‌థ‌లో బాల‌య్య చేయ‌డం కెరీర్‌లో ఇదే ఫ‌స్ట్ టైం అవుతుంది. పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాలో ఉంటుందట.

దీంతో పాటు ఈ సినిమాలో బాలయ్య తో పాటు మరో హీరో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో బాబి మ‌రో ట్విస్ట్ కూడా ఇస్తున్నాడ‌ట‌. బాలయ్యతో పాటు మ‌రో స్టార్ హీరో కూడా న‌టించ‌బోతున్నాడు. మరో హీరోగా తమిళ్ లేదా మలయాళీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ స్టార్ హీరోను దింపబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వ‌స్తుంది.