ఈ స్టార్ న‌టుల రెమ్యున‌రేష‌న్లు చుక్క‌ల్లోనే… ఎవ‌రి రేటు ఎంతంటే…!

తెలుగు సినిమాలకి బాలీవుడ్ దగ్గర మంచి మార్కెట్ ఉంది. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ తీసిన సినిమాటు అక్క‌డ బాగా రన్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా కాస్త కామన్ జోన‌ర్‌ అయితే హిందీలో విడుదల చేయడం సినిమాలకు మంచి షేరు తీసుకువస్తుంది. అలాంటి అవకాశాలు మరింతగా పెంచుకోవాలంటే బాలీవుడ్ యాక్టర్లను కూడా మన సినిమాల్లో తీసుకుంటే ఇంకా బెటర్ అని దర్శక, నిర్మాతలు అభిప్రాయం.

ఇప్పుడు ఇదే థియరీ, ఇదే స్కీమ్, టాలీవుడ్ సినిమాలన్నింటిలో కొనసాగడంతో హిందీనటులు కూడా భారీ రేట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమాకు సైఫ్ అలీ ఖాన్ రూ.14 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడ‌ని టాక్. ఇదే సినిమా లో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ కు ఇది తెలుగులో మొదటి సినిమా అయినా రూ.4 కోట్లు ఇస్తున్నారట.

ప్రస్తుతం తెలుగులో మృణాల్‌ ఠాగూర్ పలు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమె రూ3. కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. లేటెస్ట్‌గా పూరి – రామ్ సినిమాలో నటించడానికి సంజ‌య్ ద‌త్‌కి రూ.10 కోట్ల‌ వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద టాలీవుడ్ వాళ్లు బాలీవుడ్ వాళ్లను యూజ్‌ చేసుకొని సినిమాలతో మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. దాంతో పాటు నాన్ థియేటర్ మార్కెట్ కూడా బాగా లాభాలు వస్తున్నాయి.

ఇక బాలీవుడ్ యాక్టర్స్ కు మన మనీ కావాలి. వాళ్ళు ఎంత చెప్తే మన వాళ్ళు అంత రిమ్యున‌రేషన్ ఇవ్వడానికి వెనకాడకపోవడంతో బాలీవుడ్ యాక్టర్లు కూడా టాలీవుడ్ లో సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం బాలీవుడ్ సినిమాలకు క్రేజ్‌, మార్కెట్‌ తగ్గిపోవడంతో వాళ్ళ క్రేజ్ బాలీవుడ్‌లో తగ్గిపోయింది.. అందుకే టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.