ఆ ఒక్క జ్యూస్ తాగితే కావాల్సినంత అందం.. నిధి అగ‌ర్వాల్ చెప్పిన బ్యూటీ సీక్రెట్‌..!

‘ ఇస్మార్ట్ శంకర్ ‘ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తరువాత నాగ‌చైత‌న్య హీరోగా సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ కి జోడిగా నటించి ఇస్మార్ట్ శంకర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్‌.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ఎందుకో ఈ బ్యూటీకి తెలుగులో మ‌రీ ఎక్కువ అవకాశాలు రాలేదు. టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో ‘ ఈశ్వరన్ ‘సినిమా చేసింది. తమిళ్ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణంతో బోలెడంత పబ్లిసిటీ దక్కించుకుంది. శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ గురించి కోలీవుడ్ కొడైకొస్తుంది.

త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. దీనిపై నిధి అగర్వాల్ అస‌లు స్పందించ‌నే లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఆమె న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో ? ఆ సినిమా ఎప్పుడు ? రిలీజ్ అవుతుందో కూడా తెలియ‌ట్లేదు. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ తన అందం వెన‌కున్న సీక్రెట్ చెప్పింది.

నిధి పొద్దున్నే లేవగానే లెమన్ జ్యూస్ తాగుతానని. నా డైట్‌లో తాజా పండ్లు రసాలు తప్పకుండా ఉంటాయ‌ని.. అలాగే తగినన్ని మంచినీరు కూడా తాగుతానని.. టమాటో గుజ్జును చేతికి , వీళ్ళకి, అప్లై చేస్తానని. అలాగే కొంచెం పెరుగులో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటాన‌ని దీంతో ముఖం నున్నగా కాంతివంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.