ఎందుకో గాని ముందు నుంచి పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై బజ్ తక్కువగానే ఉంది. ఫ్యాన్స్ హంగామా మతప్పితే సగటు సినిమా అభిమానులు ఎవరు ఈ సినిమా చూడాలన్న ఆత్రుతతో లేరు. కామన్ ఆడియన్స్ లో ముందు నుంచి పెద్దగా హైప్ లేదు. దీనికి తోడు పవన్ నుంచి వరుసగా మూడో రీమేక్ సినిమా కావడంతో చాలామందిలో ఆసక్తి లేదు. ఇక ఓవర్సీస్ లోను ఇదే విషయం క్లియర్ గా తెలిసింది.
ప్రీమియర్ షో లతోనే అక్కడ బ్రోకు అంత సీన్ లేదని అర్థమైంది. ప్రీమియర్స్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది అనుకున్న బ్రో.. ఆదిపురుష్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే బాలయ్య వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు కంటే బాగా వెనకబడిపోయింది. ఈ ఏడాది యూఎస్ లో టాప్ 5 ప్రీమియర్ వసూళ్లలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాదే అగ్రస్థానం.
ఈ సినిమా ప్రీమియర్స్ తోనే అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. ఆ తర్వాత ఏడు లక్షల డాలర్లకు పైగా వసూళ్లతో బాలయ్య వీర సింహారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. ఇక సంక్రాంతికే వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఆరు లక్షల డాలర్లతో మూడో స్థానంలో ఉంది.
పవన్ బ్రో 6.4 లక్షల డాలర్లు వసూళ్లతో నాలుగో స్థానంలో ఉంటే.. నాని దసరా సినిమా 6.3 లక్షల డాలర్లతో ఐదు స్థానంలో ఉంది. దీనిని బట్టి బాలయ్య, చిరు సినిమాలకు ఉన్న క్రేజ్ కూడా బ్రో సినిమాకు లేదని తేలిపోయింది.