1994లో మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది అందాల భామ ఐశ్వర్యరాయ్. ఇరువర్ అనే తమిళ్ మూవితో తన 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఐశ్వర్య. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఐశ్వర్య తిరుగులేని హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్ ను పెళ్ళి చేసుకుంది. వివాహం తర్వాత వీరిద్దరికి ఆరాధ్య అనే కూతురు పుట్టింది. అప్పట్లో వీరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. పెళ్లిలో ఐశ్వర్యరాయ్ ధరించిన చీర ఖరీదు చూస్తే ఎంతటి వారైనా నోరెళ్ల పెట్టాల్సిందే. సౌత్ ఇండియాకు చెందిన అమ్మాయి కావడంతో ఐశ్వర్యారాయ్ పెళ్లి రోజు కాంచీవరం పట్టుచీర కట్టుకోవాలని పండితులు చెప్పారు.
దాంతో ప్రముఖ డిజైనర్ నీతాలూల్ల పసుపు – బంగారంతో కాంచీవరం చీరను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ చీరను స్వరోవ్స్కి క్రిస్టల్స్ తో పాటు చాలా కష్టమైన కోల్డ్ ట్రేడ్ వర్క్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారట. ట్రెడిషన్ కి ప్రతిబింబంలా కనిపించే ఈ చీరనే ఐశ్వర్యరాయ్ తన పెళ్లిలో కట్టుకుంది. ఈ చీర ఖరీదు అక్షరాల రూ.75 లక్షలట. అప్పట్లో వీరి పెళ్లి పెద్ద సెన్షేషన్ అయ్యింది.