బ‌ర్త్ డే బేబీ రాశి ఏజ్ ఎంతో తెలుసా.. ఆ రోజుల్లోనే టాలీవుడ్ సెన్షేష‌న్‌..!

రాశి అప్పట్లో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. చిన్న వయసులోనే సినిమాల‌ లోకి వచ్చిన రాశి అసలు పేరు మంత్ర. ఈ ముద్దుగుమ్మ తన ఐదో యేట బాలనటిగా వెండితెరకు పరిచయం అయింది. రాశికి ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే హిందీ సినిమాలో బాలనటిగా పరిచయం అయింది. లోకనాయకుడు కమలహాసన్ సినిమాలో కూడా బాలనటిగా నటించింది. ఆ తర్వాత కన్నడ, హిందీ భాషలతో పాటు తెలుగులోను హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

రాశి సినిమాలు మానేసి చాలా రోజులైంది. బుల్లితెర మీద కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. రాసి మొదటి సినిమా తమిళంలో చేసింది. ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో ఆమెకు హీరోయిన్గా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తెలుగులో సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన రీమేక్‌ సినిమా శుభాకాంక్షలు హీరోయిన్గా నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రాశి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

వరుసగా పదేళ్లకు పైగా టాలీవుడ్‌ను ఏలేసింది. అప్పట్లో రాశి తెలుగు సినీ ప్రేమికుల అందాల దేవత. కుర్ర కారు అయితే రాశి పేరు చెబితే పడి చచ్చేవాళ్ళు. రాశి ఒక సినిమాలో ఉందంటే చాలు కేవలం ఆమె కోసమే సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులు పెట్టేవారు. పోస్ట్ మాన్ సినిమాలో మోహన్ బాబుకు అన్నం పెడుతూ రాశి చేసిన సీన్ అప్పటికి ఇప్పటికీ చూస్తుంటే కుర్ర కారు హృదయాల్లో ఎలా ? సెగలు రేపుతాయో చెప్పక్కర్లేదు.

ముందుగా డైరెక్టర్ సురేష్ వర్మను ప్రేమ వివాహం చేసుకున్న రాశి మనస్పర్ధలు నేపథ్యంలో అతడికి విడాకులు ఇచ్చేసిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత తన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తితో కేవలం 20 రోజుల్లో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రాశి బుల్లితెరపై తెలుగు సీరియల్స్ లో నటిస్తోంది.

జానకి కలగనలేదు సినిమాలో సీరియల్లో ఆమె కీరోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాశి 1976 జులై 29న మద్రాసులో పుట్టింది. ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. నేడు ఆమె తన 43వ పుట్టినరోజును జరుపుకుంటుంది. రాశి సినిమాలుకు దూరమై ఇన్నేళ్లు అవుతున్న ఈ తరం జనరేషన్ కూడా ఆమెను చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.