‘ 7/G బృందావన్ కాలనీ ‘ సీక్వెల్ వ‌స్తోంది… హీరో హీరోయిన్లు ఎవరంటే..?

ఇటీవల గతంలో రిలీజై సూపర్ హిట్ అయిన‌ సినిమాలకు రీమేక్ కొత్త నటీనటులతో రూపొందించి సూపర్ డూపర్ హిట్‌లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు డైరెక్టర్లు. ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఈ ట్రెండ్ ఫాలో అవుతూన్నారు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న డైరెక్టర్ సెల్వ‌ రాఘవన్ గురించి మనందరికీ తెలిసిందే. అతడు కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా 7/G బృందావన్ కాలనీ.

ఈ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు సెల్వ రాఘవన్. ఇక ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గా మరో సినిమాను టాలీవుడ్‌లో తెర‌కెక్కుతోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా కి అప్పట్లో ప్రేక్షకుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పాటలు ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. ఇప్పటికి ఈ సినిమాలో పాటలు వచ్చాయంటే చాలామంది ఎంజాయ్ చేస్తూ వింటూ ఉంటారు.

తాజాగా ఈ మూవీ సీక్వెల్ రూపొందించబోతున్నారు అన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు అనే వార్తపై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది.
7/G బృందావన కాలనీ సినిమాలో రవి కృష్ణ కథానాయకుడుగా నటించగా సోనియా అగ‌ర్వాల్ హీరోయిన్గా మెప్పించింది.

7/G బృందావన్ కాలనీ 2 సినిమాకి హీరోయిన్‌గా డైరెక్ట‌ర్ శంకర్ కుమార్తె అదితి శంకర్, ఇవాన వీరిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాల్లో హీరో కోసం కొత్త కాండిడేట్ నీ సెలెక్ట్ చేయబోతున్నారు. ఇంకా హీరో ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్ టాలీవుడ్ వద్ద సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.