ఆ రోల్ నాకెందుకు… బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్‌గా చేయ‌న‌ని చెప్పిన శ్రీలీల‌..!

ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపుతున్న స్టార్ హీరోయిన్ శ్రీలీల‌. పెళ్లి సందడి లాంటి చిన్న సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత మాస్ మహారాజు రవితేజతో ధమాకా సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న శ్రీలీల ప్రస్తుతం బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్‌, నితిన్‌ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది.

ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో మొత్తం 10 సినిమాల్లో నటిస్తుందంటే ఈమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బడా సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రీ లీల కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తుంది. కథల‌ను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కధ నచ్చకపోతే ఎంతటి బడా డైరెక్టర్ అయినా.. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తానన్నా సరే టెంప్ట్ కావడం లేదట.

అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట శ్రీ లీల. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాలో అవకాశం వస్తే శ్రీ లీల‌ దానిని రిజెక్ట్ చేసిందట. పుష్ప పార్ట్ 1 లో ఉ అంటావా ఉ అంటావా ఐటెం సాంగ్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. సమంత వల్ల ఐటెం సాంగ్ కి మరింత క్రేజ్ పెరిగింది. అందుకే పుష్ప2 లో కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట సుకుమార్.

ఇందుకు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న ఓ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్న సుకుమార్ బాలీవుడ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారట. కానీ మూవీ టీమ్ శ్రీలీల‌ వైపు మొగ్గుచూపుడంతో శ్రీ లీల‌ని సంప్రదించారట. కానీ అది స్పెషల్ సాంగ్ కావడంతో తన కెరీర్ కి ఇబ్బంది అవుతుందేమోనని శ్రీలీల‌ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కాగా ఇప్పటికే శ్రీ లీల.. అల్లు అర్జున్ సరసన ఓ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. మరి వీరిద్దరూ జంటగా ఎప్పటికీ నటిస్తారో చూడాలి.