సౌత్ ఇండియాలో టాప్ 5 రిచ్ హీరోలు వీళ్లే.. ఎన్ని కోట్లు సంపాదించారంటే..?

సినిమాల్లో స్టార్‌డం సంపాదించుకొని ఆ బ్రాండ్ ను మైంటైన్ చేస్తూ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ.. ఎంతో మంది హీరోలు డబ్బు కూడా పెడుతుంటారు. దీనికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వరుస హిట్లు తమ ఖాతాలో వేసుకోవడానికి షూటింగులతో బిజీగా ఉంటూ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. జిమ్, వర్క్ అవుట్ అంటూ ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలా కష్టంతో సినిమాల్లో నటించి హిట్ కొట్టిన తర్వాత వారికి రెమ్యూనరేషన్ కూడా సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఆడి హీరోల క్రేజ్ బాగా పెరిగింది. వారికి ఉన్న క్రేజ్ ద్వారా బిజినెస్ లోకి వచ్చి అందులోను సక్సెస్ సాధించి మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అలా ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి ఎదిగిన హీరోలలో టాప్ 5 రిచ్ హీరోలు ఎవరో చూద్దాం.

నాగార్జున :
మూడు దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగార్జున 100 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం సినిమాల్లోనే కాక టాలీవుడ్ బిగెస్ట్‌ రియాలిటీ షో బిగ్ బాస్ కి హోస్టుగా వ్యవహరిస్తూ ఎన్నో బిజినెస్ రంగాల్లో రాణిస్తున్నాడు. నాగార్జున మొత్తం ఆస్తులు రూ.3010 కోట్లని తెలుస్తుంది.

రామ్ చరణ్ :
మెగా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇలా సౌత్ రిచెస్ట్ హీరోల లిస్టులో రామ్ చరణ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రామ్ చరణ్ మొత్తం ఆస్తులు రూ.1370 కోట్లుగా తెలుస్తుంది.

కమల్ హాసన్ :
తెలుగుతోపాటు దక్షిణాది అన్ని భాషల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్‌హాసన్ యాక్టింగ్ తో పాటు డైరెక్షన్, ప్రొడక్షన్ రంగాల్లోనూ అడుగు పెట్టి బాగా సంపాదించాడు. ఆయన ఆస్తులు దాదాపు రూ.450 కోట్ల ఉంటుందట.

దళపతి విజయ్ :
తమిళ్ హీరో దళపతి విజయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. అత‌డు తమిళ్ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ కోట్లలో ఆస్తిని కూడా పెట్టాడు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ మొత్తం ఆస్తులు రూ.445 కోట్లు ఉంటాయి.

రజనీకాంత్ :
కర్ణాటకలో పుట్టి పెరిగిన రజనీకాంత్ ఎంతో కష్టపడి సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ మంచి పేరు సంపాదించుకున్న రజినీ దాదాపు రూ.430 కోట్ల ఆస్తులను సంపాదించాడు.

ప్రభాస్ :
టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో చిన్న హీరోగా స్టార్ట్ అయిన ప్రభాస్ అంచలంచెలుగా ఎదుగుతూ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ దాదాపు రూ.400 కోట్ల ఆస్తులు కూడాబెట్టాడు. అలా మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, అజిత్ కుమార్ చాలామంది స్టార్ హీరోస్ కోట్లలో ఆస్తిని కూడా పెట్టి తమ సంపాదనతో కొన్ని ట్రస్టుల పేరున సహాయం కూడా చేస్తుంటారు.