‘ అరుంధతి ‘ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ లలో అనుష్క శెట్టి ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఎంతోమంది ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించిన అనుష్క టాలీవుడ్ లో అగ్ర హీరోల అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ‘ బాహుబలి ‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.

ఇక ఆమె నటించిన సినిమాలలో అరుంధతి సినిమా ఓ ప్రత్యేక క్రేజ్‌ సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. కోడి రామకృష్ణ డైరెక్షన్లో శ్యామ్‌ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాలో సోను సూద్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు మొదటగా అనుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి కాదట.

మమత మోహన్ దాస్ ని ఈ సినిమాకి అనుకున్నార‌ట‌. ఏవో కార‌ణాల‌తో ఆమె ఈ సినిమాకి నో చెప్పడంతో తర్వాత ఈ అవకాశం అనుష్కకి వచ్చింది. అనుష్క ఈ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా అనుష్క కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత వరస అవకాశాలతో అనుష్క మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.