గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్‌గా – తమన్నా విలన్‌గా చేసిన సినిమా తెలుసా..!

సౌత్ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎందరో అగ్ర హీరోయిన్లు ఉన్నారు. ఎప్పటికీ చాలామంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు. అలా సౌత్ చిత్ర పరిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో ఇలియానా కూడా ఒకరు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు వరుస‌ సినిమాలో చేసి స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత ఇలియానా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా తన సత్తా చాటింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది.

మరో స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో తొలి విజయం అందుకుంది. తమన్నా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస‌ సినిమాలో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో మరో బాలీవుడ్ నటుడు విజయవర్మతో డేటింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది.

స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాలో నటించారనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించగా తమన్నా నెగిటివ్ రోల్ లో కనిపిస్తుంది. ఆ సినిమా పేరు కేడి.. 7/జి బృందావన కాలనీ హీరో రవికృష్ణ నటించిన ఈ సినిమా అప్పట్లో తమిళంలో పెద్ద హీట్ అయింది. అందులో ఇలియానా అమాయకురాలిగా కనిపించక తమన్నా పూర్తి స్థాయిలో విలన్ గా కనిపించింది.

సినిమా చివ‌రిలో తమన్నా క్యారెక్టర్ ప్రేక్షకులకు కన్నీళ్లుు తెప్పిస్తుంది. ఇక సినిమాని అప్పట్లో తెలుగులో డబ్ చేయాలని కూడా చేశారు.. కానీ ఎందుకో కుదరలేదు అలా ఈ సినిమా ఎవరికీ తెలియకుండా ఉండిపోయింది. ఈ సినిమా ఆరోజుల్లో కోలీవుడ్లో రెండు కోట్లకు పైగా భారీ కలెక్షన్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఇలియానా- తమన్నా ఎప్పుడు కలిసి నటించలేదు.