టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ అందరూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్నకు బాలయ్య కూడా ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వలేదు. తాజాగా మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూంది. మోక్షజ్ఞ త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నాడని ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం పూర్తయిపోయిందని ఒక సూపర్ స్టోరీని మోక్షజ్ఞ కోసం బాలయ్య రాయించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నందమూరి మోక్షజ్ఞకు ఫస్ట్ సినిమాతోనే భారీ సక్సెస్ దక్కేలాగా బాలయ్య జాగ్రత్తలు తీసుకున్నాడట. యూత్ కు కనెక్ట్ అయ్యేలా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుందట. ఈ సినిమాకి సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తుంది. మోక్షజ్ఞతో పాటు ఈ సినిమాలో బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి కొడుకు దేవాన్ష్ కూడా ఓ కి రోల్ ను ప్లే చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం నందమూరి, నారా ఫ్యాన్స్ కి పండగల ఉంటుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో బాలయ్యను తీసుకోవాలనుకున్నారట మూవీ మేకర్స్.
బాలయ్య ఆ రోల్ కి మలయాళ యాక్టర్ మోహన్ లాల్ గారు కరెక్ట్ గా సెట్ అవుతారు ఆయననే ఈ రోల్ కు తీసుకోవడం కరెక్ట్ అని చెప్పాడట. దీంతో మోహన్ లాల్ ని టీం కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మోక్షజ్ఞ సినిమాలో మోహన్ లాల్ కూడా ఉంటే మొదటి సినిమాతోనే ఓ స్టార్ నటుడితో మోక్షజ్ఞ కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లే. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సేట్స్ పైకి రానుందని.. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.