ఇటీవల సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ త్రో బ్యాక్ థీమ్ తో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఫోటో అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న పాప ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చూడడానికి ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ బుజ్జి పాప టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అంతేకాదు తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
గత కొంత కాలం నుంచి ఈ హీరోయిన్ త్వరలోనే విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె భర్తతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతుందట. ఇక ఇటీవల తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో బుర్ఖా వేసుకుని హడావిడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికైనా ఈమె ఎవరో మీకు అర్థమైందా? ఎస్ మీ గెస్ కరెక్టే. ఈ ఫోటోలో ఉన్న చిన్న పాప కలర్స్ స్వాతి. టాలీవుడ్ ట్రెడిషనల్ లక్కీ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి.. కలర్స్ అనే ఓ ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత కలర్స్ స్వాతిగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకుంది.
కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో చిన్ననాటి ఫ్రెండ్ పైలట్ అయిన వికాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు వీరిద్దరి సంసారం బాగానే సాగింది. ఎంతో అన్యోన్యంగా ఈ జంట ఉన్నారు అనుకునే తరుణంలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. దానికి తోడు కలర్స్ స్వాతి వారి పెళ్లి ఫొటోస్ అన్నీ తన ఇన్ స్టా ఖాతా నుంచి డిలీట్ చేయడంతో ఈ వార్త నిజమే అని సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక ఇప్పటికైనా ఈ న్యూస్ పై కలర్స్ స్వాతి స్పందిస్తుందో లేదో చూడాలి.