టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది కేతిక శర్మ. ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ సినిమాలో కేతికా శర్మ గ్లామర్ రోల్‌ప్లే చేసి అదరగొట్టింది. కుర్రాళ్లకు చెమటలు పట్టించింది ఈ హట్ బ్యూటి. ఇంత అందమైన బ్యూటీ ఇప్పటి వరకు ఇండస్ట్రీలోకి రాకుండా ఏం చేస్తున్నట్లు అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ వర్షం కురిపించారు.
ఇక రొమాంటిక్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయిన కేతిక శర్మకు మంచి మార్కులే పడ్డాయి. కేతికకి వచ్చిన క్రేజ్ కారణంగా లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సినిమాలు కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. కానీ కంటెంట్ పరంగా సినిమా పరాజ్యం పాలైన గ్లామర్ పరంగా కేతికకి మంచి గుర్తింపు వచ్చింది.
దాని కారణంగానే ఇప్పుడు మరోసారి బ్రో సినిమాలో అవకాశం దొరికింది. ఆల్రెడీ వైష్ణవి తేజ్ తో కలిసి నటించిన కేతికా నటిస్తుంది.. ప్రస్తుతం పవన్, సాయిధరమ్ తేజ్‌లతో కూడా కలిసి నటించింది. దీంతో ఆమె చాలా తక్కువ టైంలోనే ముగ్గురు మెగా హీరోలతో నటించిన హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. బ్రో సినిమా హిట్ అయితే మాత్రం కేతిక శర్మకు వరుస అవకాశాలు రావడం ఖాయం.