నిజానికి తెలుగు సినిమా రంగంలో నిలబడాలంటే.. ఒకప్పుడు డ్యాన్స్ అయినా వచ్చి ఉండాలి. ఎక్స్పో జింగ్‌కు వెనుకాడకుండా ఉండాలి. ఇక, నటన పరంగాకూడా ముందుండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి మిస్సయినా.. ఛాన్స్ లు వచ్చేవికాదు. కానీ సుహాసిని విషయంలో నటన మాత్రమే తప్ప దర్శకులు ఇంకో యాంగిల్ చూడలేక పోయారు. దీనికి కారణం ఏంటనేది తెలియదు కానీ.. ఆమెకు డ్యాన్స్ రాదు. ఎక్స్పోజింగ్ అసలు చేయదు.
అయినా.. 1980-99 వరకు అనేక సినిమాల్లో సుహాసిని మనకు కనిపిస్తుంది. ఆమె నటనకుప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. స్వాతి సినిమా నుంచి స్వాతి చినుకులు వరకు.. ఆమె తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది. దిగ్గజ నటుడు కమల్ హాసన్ సోదరుడు చారు కుమార్తెగా తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సుహాసిని.. అనతి కాలంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. సుహాసిని నటనను చూసి అనేక మంది దర్శకులు ఆమెకు ఆఫర్లు ఇచ్చారు.
అయితే కెరీర్ ప్రారంభంలో ఆమెకు కమల్‌హాసన్ లాంటి స్టార్ హీరో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడేవారు కాదట. నీకు డ్యాన్స్ రాదు.. ఎక్స్పో… గ్ కూడా చేయవు.. నీకు హీరోయిన్గా ఎవరు ? ఛాన్స్ ఇస్తారంటూ కొందరు దర్శకులు ఆమెను పట్టించుకునే వారే కాదట. ఎప్పుడు అయితే తన నట విశ్వరూపం చూపించిందో అప్పటి నుంచి అందరూ ఆమె వెంటే పడ్డారు.
ముఖ్యంగా తెలుగులో అయితే.. రాక్షసుడు సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కానీ, ఈ సినిమాలోనూ ఆమె ఎక్కడా ఎక్స్ పోజింగ్ చేయలేదు. డ్యాన్స్ కూడా అంతగా రాదు. శోభన్‌బాబు నుంచి కృష్ణ వరకు అనేక మంది పాతతరం హీరోలతోనూ నటించారు. తమిళం, కన్నడం, మలయాళంలో సుహాసిని అనేక సినిమాల్లో నటించినా.. ఎక్కడా సంప్రదాయాన్ని విడిచి పెట్టకుండా నటించి.. తనకంటూ ప్రత్యేకతను సంతరించుకు న్నారు. ఒకానొక దశలో ఆమెకు ఆఫర్లు తగ్గినా.. బాధపడలేదు. తను గీసుకున్న గీత నుంచి బయటకు రాలేదని చెబుతారు. కానీ, ఇప్పుడు అయితే.. ఇలాంటి వారికి ఛాన్స్‌లు లేకపోవడం గమనార్హం.