పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ కలిసి నటిస్తున్నారంటే బాక్సాఫీస్ ఊగిపోవాలి. కానీ బ్రో సినిమా విషయంలో ఆ మ్యాజిక్ జరిగినట్టుగా అనిపించలేదు. పవన్ భీమ్లానాయక్ సినిమాను ఏపీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా జనాలు ఆగలేదు. ఏకంగా ఏపీ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలు, చివరకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు వెళ్లి మరి చూసి వచ్చారు.
అయితే బ్రో మల్టీస్టారర్.. పవన్ ఛరిష్మాకు తోడు సాయిధరమ్ కూడా ఉన్నాడు. ఎందుకో నైజాం బుకింగ్స్ చాలా స్లోగా కట్ అయ్యాయి. అసలు తెలుగు సినిమా వసూళ్లకు గుండెకాయగా ఉండే హైదరాబాద్‌లో కూడా పెద్దగా అడ్వాన్స్ బుకింగ్‌లో నమోదు కాలేదు. రిలీజ్‌కు ముందు రోజు ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్‌ల్లో టాప్ – 10 సినిమాల లిస్ట్ చూస్తే ఇలా ఉంది.
త్రిబుల్ ఆర్ – 10.4 కోట్లు
ఆదిపురుష్ – 8.6 కోట్లు
సర్కారు వారి పాట – 7.96 కోట్లు
కేజీయఫ్ 2 – 6.2 కోట్లు
భీమ్లానాయక్ – 6.17 కోట్లు
రాధేశ్యామ్ – 6.16 కోట్లు
పుష్ప – 5.89 కోట్లు
వకీల్‌సాబ్ – 4.65 కోట్లు
బ్రో ది అవతార్ – 4.64 కోట్లు
వీరసింహారెడ్డి – 4.5 కోట్లు
వాల్తేరు వీరయ్య – 4 కోట్లు
పై లిస్టులో చూస్తే బ్రో 9వ ప్లేసులో ఉంది. టాప్ 11 సినిమాల లిస్ట్ చూస్తే వీరసింహారెడ్డికి, బ్రోకు పెద్ద తేడా లేదు. అసలు ప్రభాస్ ప్లాస్ సినిమా ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్‌లు బ్రో కు డబుల్ ఉన్నాయి.