ఎంత క్రేజ్.. కోట్ల ఆస్తి ఉన్న .. శ్రీ లీల ఆ విషయంలో ఇప్పటికీ దురదృష్టవంతురాలే..!?

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు.. ఇక వారిలో ఒక్కో హీరోయిన్‌కు ఒక్కొక్క రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే వారిలో సోషల్ మీడియాలో మాత్రం టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల.. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా సినిమాలతో కూడా ఎవరు ఊహించని విధంగా భారీ క్రేజ్‌ను అందుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండే చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరూ కూడా ఈమె తోనే సినిమా చేయాలని ఎంతో ఆశ పడుతున్నారు.

అలాంటి భారీ క్రేజ్ తెచ్చుకుని, ఇంతటి పాపులారిటీ, పబ్లిసిటీ తెచ్చుకున్న శ్రీలీల‌ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తన మధురమైన బాల్యాన్ని ఎంతో మిస్సయిందట. మరి ప్రధానంగా ఆమె జీవితంలో తండ్రి ఉన్న లేనట్టే అంటూ ఆమె తండ్రి ప్రేమను కోల్పోయినట్లు జనాలు అంటున్నారు. శ్రీలీల పుట్టకముందే వాళ్ళ అమ్మానాన్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఇక శ్రీలీల‌ పుట్టిన తర్వాత తండ్రి ఈమెను ఒక్కసారి కూడా చూడలేదట. ఈ ముద్దుగుమ్మ కూడా చిన్నప్పటినుంచి అమ్మ పెంపకంలోనే పెరగడంతో అమ్మని ఎక్కువగా లైక్ చేసిందట. అయితే ఆడపిల్లకి తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో తండ్రి ప్రేమ కూడా అంతేే ముఖ్యం. కానీ శ్రీలీల‌కు మాత్రం తండ్రి ప్రేమ ద‌క్క‌లేదు. ఇప్పటికీ కూడా శ్రీలీల తన తండ్రి ప్రేమ కోసం ఎంతో ఎదురు చూస్తూనే ఉంది.

అయినా సరే శ్రీలీల నాన్న ఆమెను దగ్గరికి రానివ్వటం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఎంత ఆస్తి క్రేజ్ పబ్లిసిటీ ఉన్న నాన్న అన్న పిలుపుకు దూరమైందని ..నాన్నఇచ్చే ప్రేమకు నోచుకోలేకపోయిందని నెటిజెన్లు సానుభూతి కామెంట్లు చేస్తున్నారు. దీంతో శ్రీలీల‌ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.