చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరో చెప్పలేం. సినిమా పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి విజయాలు అందుకోవటం సరామామూలే. ఇదేవిధంగా టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు దర్శకులు అనుకున్న హీరోలు వేరు సినిమా చేసిన హీరోలు వేరు. అలా టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు వదులుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.
పవన్ కళ్యాణ్, పూరి కాంబోలో చేయాల్సిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి సినిమాలు రవితేజ- మహేష్ బాబులు చేసి బంపర్ హిట్ అందుకున్నారు. ఇదే లిస్టులోకి రామ్‌చరణ్ నటించిన రచ్చ సినిమా కూడా వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కథను ముందుగా దర్శకుడు సంపత్ నంది ఎన్టీఆర్ తో చేయాలని భావించారు. అలాగే ఎన్టీఆర్‌కు స్టోరీ కూడా చెప్పాడు. ఇక తారక్‌కు కథ నచ్చిన ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో సినిమాకు నో చెప్పాడు.
ఆ తర్వాత ఇదే కథతో రామ్ చరణ్- తమన్నా జంటగా సంపత్ నంది రచ్చ మూవీ తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడు. ఎన్టీఆర్‌కు కథ నచ్చిన డేట్ లో అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఈ సినిమాను వదులుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇదే స్టోరీని రామ్ చరణ్ కు చెప్పగా ఆయనకు కథ బాగా నచ్చడంతో వెంటనే డేట్లు ఇచ్చేసి సినిమా చూసి సూపర్ హిట్ కొట్టాడు.
ఈ విధంగా ఎన్టీఆర్ తో చేయాల్సిన రచ్చ సినిమా రామ్ చరణ్ హీరోగా వచ్చి మంచి విజయం సాధించింది అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ తన తండ్రి నటించిన గ్యాంగ్‌లీడర్ సినిమాలో వచ్చిన వాన వాన వెల్లువాయే పాటను కూడా రీమిక్స్ చేశాడు. అలా ఈ సినిమా రామ్ చరణ్ కు ఓ మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది.