బాలయ్య మిస్ అయిన బ్లాక్ బస్టర్ వెంకటేష్ ఖాతాలో.. ఈ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా..!?

చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు చేయాల్సిన సినిమాలను మరో హీరో చేసి హిట్లు, ప్లాప్‌లు కొట్టడం కామన్ గా జరుగుతుంది. ఎవరు ఊహించిన విధంగా కొన్ని కారణాల చేత ఓ హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంటే ముందుగా ఆ కథ వదులుకున్న హీరోకు ఆయన అభిమానులకు పెద్ద డిసప్పాయింట్ ఏ అవుతుంది. ఈ క్రమంలోనే గతంలో నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయాలనుకున్న ఓ సినిమా రూట్ మారి మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గరికి వెళ్ళింది. అలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

90వ దశంలో బాలయ్య- వెంకటేష్ వరుస విజయాలతో సూపర్ జోష్లో దూసుకుపోయారు. ఆ క్రమంలోనే పరుచూరి సోదరులు.. యాక్షన్ దర్శకుడు బి గోపాల్ కాంబోలో ఓ సినిమాను బాలయ్య తో చేయాలని క‌థ‌ను కూడా రెడీ చేశారు. అప్పుడు బి.గోపాల్ కోలీవుడ్లో చిన్న తంబి అనే సినిమా వచ్చింది.. ఆ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించారు. సినిమా కథ చాలా బాగుంది మీరు కూడా చూడండి.. బాల‌య్య‌ చేస్తే బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని పరుచూరి బ్రదర్స్ తో అన్నారట.

వెంటనే పరుచూరి సోదరులు చిన్నతంభి సినిమాను చూసీ బాలయ్యతో చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. పరుచూరి సోదరులు ఇది బాలయ్యకు ఏకంగా సిల్వర్ జూబ్లీ సినిమా అవుతుందని కూడా అనేశారు. ఆ సినిమా రైట్స్ కొందామని అనుకున్నప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను క్రియేటివ్ కమర్షియల్ అధినేత కేఎస్ రామారావు కొనేసి విక్టరీ వెంకటేష్ తో ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఆ విధంగా బాలయ్య చేయాల్సిన ఆ సినిమా అలా పక్కకు వెళ్ళిపోయింది. కే.ఎస్ రామారావు, వెంకటేష్ హీరోగా రవిరాజా పినిసెట్టి దర్శకత్వంలో చిన్నతంబిని తెలుగులో చంటిగా రీమిక్‌ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ కు జోడిగా మీనా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ అమాయకపు నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వెంకీకి ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా కూడా అవార్డులు కూడా వచ్చాయి. అలాగే దివంగత లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యానికి కూడా ఈ సినిమాకు గాను ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

ముందుగా చంటిలో వెంకటేష్ కు జంటగా మీనాని కాకుండా త‌మిళంలో హీరోయిన్‌గా చేసిన ఖుష్బూను నటింపచేయాలి అనుకున్నారు. అయితే ఆమె తెలుగులో వెంకటేష్ పక్కన చేసేందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ తర్వాత మీనాను తీసుకున్నారు. అలా ఆ సినిమా తెరకెక్కి విడుదలై 40 కేంద్రాల్లో వందరోజులకు పైగా ఆడింది. ఈ విధంగా బాలయ్య చేయాల్సిన ఈ సూపర్ హిట్ సినిమా వెంకటేష్ ఖాతాలో పడింది.