టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ప్రత్యేకమైన సర్కిల్ ఉంది. ఆయన సినిమాల కోసం ఎదురుచూసే అభీమానుల్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు.. ఆరుపదుల వయస్సు వచ్చినా కూడా టాలీవుడ్ కి గాడ్ ఫాదర్గా నిలిచారు. ఇక చిరంజీవి ప్రస్తుతం తన భార్య సురేఖతో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్లారు. ఇదే సమయంలో చిరు వెకేషన్ కి వెళ్తున్న విషయం ఎవరికీ తెలియదు.
ఆయన సోషల్ మీడియాలో తన భార్యతో కలిసి ఫ్లైట్లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే ఆ ఫిక్స్ చూసి చాలామంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. మనవరాలతో కలిసి ఆడుకోకుండా ఎందుకు ? ఈ టూర్లు చేస్తున్నారు అంటూ కూడా ఆయనపై ట్రోలింగ్ చేశారు. తాజాగా ఇప్పుడు మెగాస్టార్ అమెరికా వెకేషన్ పై సరికొత్త కోణం బయటకు వచ్చింది. చిరు వెకేషన్ కోసం అమెరికా వెళ్లలేదని ఓ సర్జరీ కోసం వెళ్ళినట్టు తెలుస్తుంది.
చిరు తన కాలికి మైనర్ సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళినట్టు అసలు విషయం బయటకు వచ్చింది. అయితే ఆయన కాలికి ఓ మైనర్ సర్జరీ జరిగిందని భయపడాల్సిన అవసరం లేదని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటికి రావటంతో మెగా అభిమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ముందుగా ఈ విషయం తెలిస్తే అభిమానులు ఆందోళనకు గురవుతారని ఈ విషయాన్ని దాచారని మరో వార్త బయటకు వచ్చింది.
చిరంజీవి సర్జరీ అనంతరం భార్య సురేఖతో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో యంచి హిట్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.