విడాకులు ఇచ్చినా మాజీ భ‌ర్త ప్రేమ‌లో చిరంజీవి హీరోయిన్‌… ఇదేం ట్విస్ట్ రా బాబు..!

చిత్ర పరిశ్రమలో ఉండే సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఏమీ ఉండవు. వారికి ఉన్న స్టార్‌డమ్ పక్కనపడితే వాళ్ళు కూడా అందరిలాంటి మనుషులే. వారి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులు, మనస్పర్ధలు ఉంటాయి. కొన్నాళ్లపాటు ఎంతో ఆనందంగా కలిసి కాపురం చేశాక కూడా విడిపోతూ ఉంటారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుని ఇతరులతో సెటిలై పోయేవారు కొందరు. ప్రేమ ఇతర విషయాల కారణంగా మోసపోయి వివాహానికి దూరంగా ఉండేవారు మరికొందరు.

సాధారణంగా ఎవరైనా ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత తమ గతం గురించి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు. కానీ విడిపోయి ఇన్నేళ్లవుతున్నా తన మాజీ భర్త అంటే ఇప్పటికీ ఇష్టమనే చెబుతుంది సీనియర్ నటి నళిని ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
1981లో తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి కలిసి న‌టించిన‌ ‘రణువ వీరన్’ సినిమాతో నళిని హీరోయిన్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ సినిమా తెలుగులో బందిపోటు సింహం పేరుతో రిలీజ్ అయింది.

ఆ తర్వాత చిరంజీవికి జంటగా సంఘర్షణ, ఇంటిగుట్టు సినిమాల్లో నళిని నటించింది. అప్పటి నుంచి 1988 వరకు సంవత్సరానికి ఐదు నుంచి 20 సినిమాల్లో న‌టించింది. కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది. అదేవిధంగా తమిళం, మలయాళం, తెలుగు భాషలో పలుషోలకు, సీరియల్స్ లో కూడా ఈమె నటించింది. పెళ్లి విడాకులు తర్వాత 2002లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. రవితేజ వీడే, హరికృష్ణ సీతయ్య సినిమాలో లేడీ విలన్‌గా తన నటనతో నళిని ఆకట్టుకుంది. తెలుగులో చివరిగా బ్రాండ్ బాబు సినిమాలో కనిపించింది.

అదేవిధంగా తెలుగులో బుల్లితెరపై ‘అమ్మ నా కోడలా’, భాగ్యరేఖ, ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్స్ లో కూడా ఈమె నటించి ప్రేక్షకులను అలరించింది. ఇదే సమయంలో నళిని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో ఏడాదికి 24 సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉండే దాని కేవలం తినడం, నిద్రపోవటం కోసం పెళ్లి చేసుకోవాలని భావించాను. అలాంటి సమయంలో నటుడు రామ రాజన్‌తో ప్రేమలో పడ్డాను.

కొన్నాళ్లకు మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాను దాంతో వాళ్ళు రామ రాజన్‌తో కలిసి నటించడానికి ఒప్పుకోలేదు. అయినా కూడా మా ప్రేమ మీద నమ్మకంతో ఇంట్లో వారిని ఎదిరించి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆయన ఎంతో మంచి మనిషి బంగారం లాంటి వ్యక్తిత్వం అయినా కూడా అనుకోకుండా మా మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నాం. దీంతో మా పెళ్లి రద్దయినప్పటికీ ఆయన్ని నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నా ఈ విషయం ఆయనకు కూడా తెలుసు అంటూ నళిని ఆ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది.