నానితో సినిమా అంటే నిర్మాత‌ల‌కు న‌ర‌క‌మేనా.. కెలుకుడు ఏ స్థాయిలో అంటే..!

టాలీవుడ్ లో చాలామంది హీరోలు.. స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తున్నప్పుడే అన్ని విషయాల్లోనూ కాళ్లు వేళ్లు పెట్టి దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించేస్తూ ఉంటారన్నది తెలిసింది. బాలయ్య – మహేష్ లాంటి ఒకరిద్దరు హీరోలు మినహా ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన హీరోలు అందరూ ఒక్కోసారి కథలోనూ ఇతర విషయాల్లోనూ వేళ్లు పెట్టి అటు దర్శకులకు ఇటు నిర్మాతలను బాగా టెన్షన్ పెడుతూ ఉంటారన్న విమర్శలు ఉన్నాయి.

బాలయ్య – మహేష్ మాత్రం ఇందుకు పూర్తిగా మినహాయింపు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఈ తరహా ఆరోపణలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు యంగ్ హీరో నాని పై కూడా అదే తరహా ఆరోపణలు వస్తున్నాయి. నానితో సినిమా అంటే మొత్తం నాని చెప్పిందే జరగాల‌ట‌. కనీసం ఖర్చు విషయంలో కూడా నిర్మాత చెప్పినట్టు జరగదని.. ఇక డైరెక్షన్లో ఎలాగూ వేలు పెట్టి కలిగేయడం నానికి అలవాటే అని అంటూ ఉంటారు. నాని హీరోగా హాయ్ నాన్న సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు బడ్జెట్ అనుకున్న దానికంటే గట్టిగానే అవుతోందట. నాని రెమ్యున‌రేష‌న్‌ ఇటీవల కాలంలో రు. 20 కోట్లు దాటింది. ఇక నిర్మాణ వ్యయం కూడా బాగా పెరిగిపోతోందట. దసరా సినిమా బాగా ఆడింది. అందుకే నిర్మాతకు పెద్ద సమస్య రాలేదు. కానీ హాయ్ నాన్న లాంటి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీకి కూడా విపరీతంగా ఖర్చుపెట్టిం చేస్తున్నాడ‌ట. నాని అటు దర్శకులకు.. ఇటు నిర్మాతల మాటకు కూడా విలువ ఇవ్వడం లేదని.. అంతా నాని కంట్రోల్ లోనే ఉండేలా చేస్తున్నాడని దర్శకులు నిర్మాత ఒక్క మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు.

ఖర్చు పెరిగిపోవడంతో నిర్మాతకు మిగిలిన ఆప్షన్ ఒక్కటే అమ్మకాలు పెంచేస్తున్నారు. అందుకే హాయ్ నాన్న సినిమాకు ఓవర్సీస్ రైట్స్ రు. 7.30 కోట్లకు – హిందీ డబ్బింగ్ రేట్స్ రు. 20 కోట్లకు పైనే చెబుతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా నాని దర్శక నిర్మాతల మాటలకు విలువ ఇస్తే అతడి కెరీర్ పై ఇలాంటి మరకలు, మచ్చలు లేకుండా కొన్నేళ్లపాటు చక్కగా కొనసాగుతుంది. నాని తన నటన వరకు తాను చూసుకుంటే మిగిలిన సాధకబాధకాలు దర్శకుడు, నిర్మాత చూసుకుంటారు.