ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం.. యాంకర్ సుమ మరి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందా..?

టాలీవుడ్ స్టార్ ఫిమేల్ యాంకర్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది సుమ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పైనే అయినప్పటికీ ఇంకా అదే క్రేజ్ తో దూసుకుపోతుంది. వరుస అవకాశాలను అందుకుంటూ మంచి ఫామ్ లో ఉంది. ఏదైనా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, బుల్లితెరపై సుమ హోస్ట్ గా షోచేస్తే అది సూపర్ సక్సెస్ సాధిస్తుందని డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా నమ్ముతారు. ఇక సుమ ఎప్పటికప్పుడు తన షూటింగ్ అప్డేట్స్ తో పాటు కొన్ని పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇప్పటికే సుమ యాంకరింగ్ ద్వారా రెండు చేతుల సంపాదిస్తూ దాదాపు రూ.100 కోట్లకు పైగా ఆస్తిని కూడబెట్టిందట. తాజాగా సుమ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడు ఇండస్ట్రీలో ఉండే నటీనటులు అవకాశాలను కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నచ్చిన ఫుడ్ ను దూరం పెడుతూ నచ్చకపోయినా డైటింగ్ చేస్తూ కష్టపడుతూ ఉంటారు. అలా సుమ ఎదురుగా ప్లేట్లో నోరూరించే స్వీట్స్ ఉన్నా తినకూడదు అన్నట్లు పచ్చి కూరగాయలు తింటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఎంత సంపాదించినా ఏం లాభం నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

నీకు నచ్చిన ఫుడ్ తినకుండా ఎందుకు ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికీ ఫామ్ లో ఉన్న సుమ యాంకరింగ్ మానేస్తుందంటూ కొన్ని పుకార్లు వచ్చినా ప్రస్తుతం బుల్లితెరపై సుమ అడ్డ షోలోకనిపిస్తూనే ఉంది. త్వరలోనే సుమ కొడుకు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం సుమ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)