నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దివంగత లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీ సంస్థ నిర్మించిన భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక అయన రెండో సినిమానే ఎవరు ఊహించిన విధంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ రేంజ్ లో మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఆయన బ్యానర్లో తెరకెక్కింది.
ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో హీరోయిన్ మోహిని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈమె తెలుగులో నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే ఈమె తెలుగులోనే కాకుండా ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో నటించి మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఈమె తన సినీ జీవితంలో ఎంత సక్సెస్ అయిన తన వ్యక్తిగత జీవితంలో ఎవరు ఊహించని విధంగా మోసపోయింది.
మోహిని సినిమాల్లో చేస్తున్న సమయంలోనే భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమెరికా వెళ్ళిపోయింది. పిల్లలు వారీ జీవితం ఎంతో హాయిగా ,సాఫీగా సాగిపోతోన్న సమయంలో మోహినికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి కొడుకు పుట్టాక ఆమెకు నరాలకు సంబంధించిన వ్యాధి సోకింది. ఆ సమస్యతో చాలాకాలం ఇబ్బంది పడింది.. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎవరు ఊహించని సంఘటన జరిగింది.
స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన మోహిని అప్పటివరకు ఎంతో సాంప్రదాయ బద్దంగా పూజలు పురస్కారాలు చేస్తూ జన జీవితాన్ని కొనసాగించేది. అక్కడే ఎవరు ఊహించని విధంగా క్రైస్తవం తీసుకుని తన పేరును కూడా మార్చేసుకుంది. తనలా జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న వారికి అండగా నిలుస్తూ, వారికోసం ప్రార్థనలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది.