జాన్వీ కన్నా ముందే “దేవర” సినిమాకి అనుకున్న స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా..? సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది అంటే..!?

తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లోనే యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా భారీ క్రేజ్ అందుకున్నాడు. అలాంటి ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. టాలీవుడ్ స్టార్ట్ దర్శకుడు కొర‌టాల‌ శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అదేవిధంగా ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుంది దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఈ సినిమాలోని జాన్వీ కపూర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కంటే ముందే మరో హీరోయిన్ ని కొరటాల ఎంచుకున్నారు . ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరు కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్. ఇదే విషయాన్ని గతంలో కూడా ఆలియా ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసింది.

త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో నటించబోతున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది. అయితే ఆ తర్వాత ఈమె గర్భవతిగా మారడంతో సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్లపాటు దూరమైంది. దాంతో ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకుంది. అయితే ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ ని ఎంచుకున్నాడు కొరటాల. దీంతో సినిమాకి ఒప్పుకొని అలియా భట్ తను తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేసిందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.