టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ సినిమాలో చేస్తున్న సమయంలోనే హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు ఇద్దరు పిల్లలు అయితే మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకోకుండా ఉంటే నందమూరి ఇంటికి అల్లుడు అయ్యుండేవాడట.
అసలు విషయంలోకి వెళ్తే బాలకృష్ణ – మహేష్ బాబుని తన పెద్ద పెద్దళ్లుడిగా చేసుకోవాలని భావించరట. కానీ మహేష్ బాబు అప్పటికే నమ్రతను ప్రేమించానని చెప్పడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ- బాలయ్య తండ్రి ఎన్టీఆర్ ఎంతో మంచి మిత్రులు అలాగే కృష్ణ కూడా నటరత్న ఎన్టీఆర్కు ఎంతో వీరాభిమాని ఆ చనువు తోనే బాలయ్య పెద్దకూతురు బ్రాహ్మణిని మహేష్ కు ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు.
ఈ విషయంలో కృష్ణ- బాలకృష్ణ కూడా వివాహం చేయాలని నిశ్చయించుకున్నారట. కానీ అప్పుడే సినిమాల్లోకి మహేష్ ఎంట్రీ ఇవ్వడంతో కొద్దిరోజులు తర్వాతే వివాహం చేయాలని అనుకున్నారు. ఇక కొన్ని రోజులకు బాలకృష్ణ- మహేష్ బాబుతో వివాహం గురించి చెప్పాడట. దాంతో మహేష్- నమ్రతను ప్రేమిస్తున్నారని చెప్పడంతో ఇద్దరు ప్రేమికులన్నీ విడదీయడం ఎందుకని బాలకృష్ణ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఇక మహేష్ బాబు- నమ్రతను వివాహం చేసుకున్నాడు. ఇక వీరి వివాహం జరిగిన రెండు సంవత్సరాలకి బాలకృష్ణ అక్క కొడుకు అయినా నారా లోకేష్ తో బ్రాహ్మణి వివాహం జరిపించారు. బాలయ్య అడిగిన సమయంలో మహేష్ నమ్రతను ప్రేమించకపోయి ఉంటే కచ్చితంగా నందమూరి అల్లుడు అయి ఉండేవాడు.