నటరత్న ఎన్టీఆర్‌కు ఆ స్టార్ హీరోయిన్ కు ఉన్న లింక్ ఏంటి..? పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాడా..?

నటరత్న ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో మలుపులు ఉన్నాయి. అలాంటి ఎన్టీఆర్ సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎవరూ చేరుకొని ఎన్నో అరుదైన ఘనతలను అందుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఓ హీరోయిన్ విషయంలో మాత్రం ఆయనకు చాలా తలనొప్పి వచ్చింది. ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ జరిగిన ఎలక్షన్ లో ఎన్టీఆర్ ఓడిపోయాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ మరోసారి సినిమాలు చేసీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో సామ్రాట్ అశోక సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా వాణి విశ్వనాథ్ నటించింది. ఈ సినిమాలు నటించే సమయానికి ఈమె వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. 15 సంవత్సరాల వయసులో 60 ఏళ్ల వయసు ఉన్న ఎన్టీఆర్ కు జంటగా ఎంతో అద్భుతంగా నటించింది వాణి. సినిమాలో హీరోయిన్‌గా వాణి షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆమెకు రెమ్యున‌రేష‌న్ తో పాటు అదనంగా 50 వేల రూపాయలు కూడా ఇచ్చారట.

ఇక అదే సమయంలో ఎవరు ఊహించిన విధంగా అప్పటి పత్రికల్లో ఎన్టీఆర్- వాణి విశ్వనాథ్‌ని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ అప్పటికే భార్య చనిపోయి ఒంటరిగా ఉండటం.. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అవడంతో వాణి విశ్వనాథ్ అందం అన్ని కలిపి ఈ రూమర్లకు బలం చేకూర్చాయి. చిత్ర పరిశ్రమలో కూడా ఈ వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ వార్తల వెనుక అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పెద్దల హస్తం ఉందనే టాక్ కూడా ఉంది. తన జీవిత చరిత్రను రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993లో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నాక ఈ పుకార్లకు పుల్ స్టాప్ ప‌డ్డాయి. మలయాళంకి చెందిన వాణి విశ్వనాథ్ నాలుగు సంవత్సరాలలో 15 కు పైగా వానపాటలో నటించి గ్లామరస్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది.