నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ వరుస సినిమాలో నటిస్తూ టాలీవుడ్ లోనే యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గానే కాకుండా గ్లోబల్ స్టార్ గా మారాడు. ఇక అదే విధంగా నందమూరి కుటుంబ క్రేజ్‌ను కూడా మరో లెవల్ గా తీసుకువెళ్లి తాతకు తగ్గ మనవడుగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడని చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఆహార అలవాట్ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ తన డైలీ లైఫ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటిలో ఎంతో లావుగా ఉండేవారు. ఆ తర్వాత చాలా స్లిమ్ గా ఫీట్ గా మారాడు. ఎంతో బరువు తగ్గిన ఎన్టీఆర్ డైట్ విషయంలో ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటారట. అందుకే ఆయన బాడీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ మార్నింగ్ నిద్ర లేవటం యోగ, ఎక్స్‌ప్రెస్ అంటూ రెండు గంటలు వర్క్ అవుట్ చేస్తారట. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా రాగిజావని కంపల్సరిగా రెండు గ్లాసులు తీసుకుంటారట. దీని తర్వాత వాటర్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని కచ్చితంగా తీసుకుంటారట. ఆ తర్వాత రోజు రెండు లేదా మూడు ఉడకపెట్టిన ఎగ్స్ ని తింటారట. భోజనం విషయానికొస్తే కచ్చితంగా రాగి సంగటి నాటుకోడి ఎంతో ఇష్టంగా తింటారట. ఆయన ఎంత డైట్ ఫాలో అయినా కానీ తనకిష్టమైనవి కచ్చితంగా తీసుకుంటారట.
ఇక తర్వాత నైట్ డిన్నర్ వరకు ఎలాంటి ఆహారం తీసుకోరట. కేవలం జ్యూస్ మాత్రమే తీసుకుంటారట ఇక నైట్ డిన్నర్ కి ఖచ్చితంగా వారంలో ఒకసారి చికెన్ బిర్యాని- మటన్ బిర్యానీ ఉండేలా చూసుకుంటారట. ఇక ఇదే డేట్ ను తన కుటుంబం మొత్తం ఫాలో అయ్యేలా యంగ్ టైగర్ ఓ కండిషన్ పెట్టారట. ఈ విధంగా తన భార్య తన పిల్లలు కూడా ఎన్టీఆర్ లాగానే ఈ డైట్ ఫాలో అవుతారని తెలుస్తుంది.