బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య డైరెక్ట్ చేసిన సినిమా తెలుసా.. ఈమెలో ఈ టాలెంట్ కూడానా..!

రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఊహించని భారీ రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే పాటలు, టీజర్, టైలర్ తోనే విశేషంగా ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా అంతకు మించిన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈనెల 14న మొదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామి ఇప్పటికీ అదే జోరులో కొనసాగుతుంది.

వరుసగా 11 రోజులుగా కోటి రూపాయలు తగ్గకుండా వసూళ్లను రాబ‌డుతుంది. ఈ సినిమా త్వరలోనే వందకోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతుంద‌ని కూడా ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే ఈ సినిమాలో పేరుకే ఇద్దుల హీరోలు ఉన్నారు. కానీ సినిమా మొత్తం హీరోయిన్ వైష్ణవి చైతన్యదే.. చిన్న చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో రిల్స్‌ చేసుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.

అయితే వైష్ణవి సినిమాల్లోకి రాకముందు కూచిపూడి డ్యాన్స్ లో ఎంతో ప్రావీణ్యత సాధించారు. అదేవిధంగా డాన్స్ పోటీల్లో ఆమె స్టేట్ నెంబర్ వన్ గా కూడా నిలిచారు. అంతేకాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను స్థానం దక్కించుకున్నారు. ఇదంతా పక్కన పెడితే యూట్యూబ్లో ఈ అమ్మాయికి సంబంధించిన ఎన్నో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ కనిపిస్తాయి. ఇక వాటిలో సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అనే షార్ట్ ఫిలిం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికీ కూడా ఈ సిరీస్ కి ప్రతిరోజు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ షార్ట్ ఫిలింలో వ‌చ్చే చాలా సన్నివేశాలకు వైష్ణవి చైతన్య దర్శకత్వం వహించారట. అదేవిధంగా యూట్యూబ్ లో ఎన్నో తాను చేసిన కవర్స్ సాంగ్స్ కి ఈమె కొరియోగ్రాఫర్ కూడా చేసిందట ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉంద అంటూ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.