తెలుగు సినీమా రంగంలో అనేక రహస్యాలు ఉన్నాయని అంటారు. పెద్ద పెద్ద హీరోయిన్ల పెళ్లిళ్లు.. పిల్లలు.. వారి వివరాలు ఇప్పటికీ.. ఒక మిస్టరీగానే ఉన్నాయని చెబుతారు. అయితే.. అందరూ అని కాదు.. కొందరి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ సినీ రంగంలో ఏదో ఒకటి గ్యాసిప్ బయటకు వస్తూనే ఉంటుంది. అలాంటి కొందరి విషయంలో అయితే.. అనేక విషయాలపై ఇప్పటికీ సందేహాలు నెలకొనే ఉన్నాయి.
అయితే.. ఇవన్నీ కూడా మిస్టరీనే అంటారు. తెలుగులో అగ్రతారగా ఒక రికార్డు సృష్టించిన జయప్రద వివా హం.. సంతానం విషయాలు ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. ఏకంగా ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుందని.. ముగ్గురు పిల్లలు ఉన్నారని.. కానీ, ఆమె వారిని తన కుంటుంబంలోని వారికే దత్తత ఇచ్చేసిందని చెబుతారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యూపీకి మకాం మార్చిన జయప్రద.. అక్కడ రాజకీయ అగ్రనేత ను రాక్షస వివాహం చేసుకుందని అప్పట్లో సినిమా పత్రికలు రాశాయి.
ఇక, జయసుధ విషయం కూడా ఇలానే మిస్టరీగా ఉందని చెబుతారు. ఆమె వివాహం చేసుకునే ముందే.. తెలుగులో ఓ అగ్రదర్శకుడితో డేటింగ్ చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉండేది. ఆ దర్శకుడి సినిమాల్లో ఎక్కువగా నటించడంతోపాటు.. ఆయనకు చేరువగా ఉండడంతో ఈ టాక్ వచ్చి ఉంటుందనే చర్చ కూడా ఉంది. మొత్తంగా చూస్తే.. జయసుధ వ్యవహారం ఇలా ఉండేది.
ఇక, మరో అగ్రతార.. రాధిక. ఈమెకు రెండు వివాహాలు అయ్యాయని ఆమే చెప్పుకొచ్చారు. అయితే.. రహ స్యంగా మరో రెండు వివాహాలు చేసుకున్నారని.. నలుగురు పిల్లలు ఉన్నారని.. వారిని వేరేవారికి దత్తత ఇచ్చారనితమిళ పత్రికలు పెద్ద ఎత్తున రాసాయి. అయితే.. వాటిని రాధిక ఖండించనూ లేదు.. ఒప్పుకోనూ లేదు. మొత్తానికి ఈ అగ్రతారల వ్యక్తిగత జీవితాల్లో పెళ్లిళ్లు-పిల్లలు.. ఇప్పటికీ రహస్యమే కావడం విశేషం.